స‌ల్మాన్ ను దేశం దాటించింది ఎవ‌రు..?

స‌ల్మాన్ ఖాన్ లాంటి హీరో దేశం దాటితే పెద్ద వింతేం కాదు. ఎప్పుడూ షూటింగ్స్ తో బిజీగా ఉండే కండ‌ల వీరుడు.. ఫారెన్ వెళ్తే అందులో వింతేం ఉంది అనుకుంటున్నారా..? ఉంది.. వింత ఉంది.. ఎందుకంటే మిగిలిన హీరోలు దేశం దాటాలంటే ఎవ‌రి ప‌ర్మిష‌న్ అవ‌స‌రం లేదు కానీ.. స‌ల్మాన్ దేశం దాటాలంటే కోర్ట్ అనుమ‌తి కావాలి.
SALMAN KHAN NOT IN INDIA
ఆయ‌న ఇప్పుడు దోషి.. కృష్ణ‌జింక‌ల కేస్ లో ఐదేళ్లు శిక్ష ప‌డిన ఖైదీ.. రెండు రోజులు జైల్లో ఉండొచ్చిన ఖైదీ. ప్ర‌స్తుతం బెయిల్ పై ఉన్నాడు స‌ల్మాన్. ఈయ‌న దేశం దాటాలంటే కోర్ట్ అనుమ‌తి కావాల్సిందే. మ‌ల్టా దేశంలో భ‌ర‌త్ షూటింగ్ కోసం ప‌ర్మిష‌న్ అడిగితే నో అనేసింది కోర్ట్. కానీ మ‌ళ్లీ త‌ర్వాత ష‌ర‌తుల‌తో కూడిన ప‌ర్మిష‌న్ ఇచ్చింది.
దాంతో ఇప్పుడు హాయిగా ఫారెన్ చెక్కేసాడు స‌ల్మాన్ ఖాన్. అక్క‌డే క‌త్రినాకైఫ్ తో క‌లిసి డ్యూయెట్లు పాడుకుంటున్నాడు. మ‌ల్టాలోనే నెల రోజులు షూటింగ్ చేయ‌నున్నాడు ద‌ర్శ‌కుడు అలీ అబ్బాస్ జాఫ‌ర్. ఈ సినిమాలో ముందు ప్రియాంక చోప్రాను హీరోయిన్ గా తీసుకున్నా.. ఇప్పుడు ఆమె స్థానంలోకి క‌త్రినా వ‌చ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here