స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ `య‌మ్6` ట్రైల‌ర్ లాంచ్‌!!

విశ్వ‌నాథ్ ఫిలిం ఫ్యాక్ట‌రి, శ్రీల‌క్ష్మి వెంక‌టాద్రి క్రియేష‌న్స్ బేన‌ర్స్ పై  విశ్వ‌నాథ్ త‌న్నీరు, సురేష్‌.ఎస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం `య‌మ్6`. మారుతి, శ్రావ‌ణి, ప్రియ హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రానికి జై రామ్ వ‌ర్మ ద‌ర్శ‌కుడు.  ఈ చిత్రం ట్రైల‌ర్ లాంచ్ గురువారం హైద‌రాబాద్ లో జ‌రిగింది.  ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టిఎఫ్‌సిసి ఛైర్మ‌న్ ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ టైల‌ర్ లాంచ్ చేశారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ…“హ‌ర్ర‌ర్ అంశాల‌తో పాటు యూత్ ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్ గా `య‌మ్6` చిత్రం రూపొందిన‌ట్లు ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతోంది. హీరో మారుతి ఈ చిత్రంతో హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. భ‌విష్య‌త్ లో మంచి హీరోగా ఎదిగే ల‌క్ష‌ణాలు మెండుగా ఉన్నాయి. ట్రైల‌ర్ క‌ట్ చేయ‌డంలోనే ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ ఏంటో తెలిసింది. మ్యూజిక్ కూడా బాగుంది. యూనిట్ అంద‌రికీ నా శుభాకాంక్ష‌లు“ అన్నారు.
 సాయి వెంక‌ట్ మాట్లాడుతూ…“ మ్యూజిక్, న‌టీన‌టుల ప‌ర్ఫార్మెన్స్  ట్రైల‌ర్ లో ఆక‌ట్టునే విధంగా ఉన్నాయి. ప్ర‌తిభ గ‌ల ద‌ర్శకుడు, అభిరుచి గ‌ల నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ద్వారా అంద‌రికీ మంచి రావాలిని కోరుకుంటున్నా“ అన్నారు.
 న‌టి రాగిణి మాట్లాడుతూ…“నిర్మాత విశ్వ‌నాథ్ గారు నాకు చాలా కాలం నుంచి తెలుసు. ఎంతో క‌ష్ట‌ప‌డి పైకొచ్చిన వ్య‌క్తి. ట్రైల‌ర్ బావుంది. ఈ సినిమా ప‌ని చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ మంచి పేరు తీసుకురావాల‌ని కోరుకుంటున్నా“ అన్నారు.
సంగీత ద‌ర్శ‌కుడు విజ‌య్ బాలాజి మాట్లాడుతూ…“నేప‌థ్య సంగీతానికి స్కోపున్న చిత్రం. ఇందులో ఒక మంచి పాట కూడా ఉంది. ద‌ర్శ‌క నిర్మాత‌లు ఇచ్చిన స్వేచ్ఛ‌తో మంచి మ్యూజిక్ చేయ‌గ‌లిగాను“ అన్నారు.
ద‌ర్శ‌కుడు జై రామ్ వ‌ర్మ మాట్లాడుతూ…“నాలో ప్ర‌తిభ‌ని గుర్తించి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అవ‌కాశం క‌ల్పించిన మా నిర్మాత‌కు రుణ‌ప‌డి ఉంటాను. ఇదొక స‌స్పెన్స్ థ్రిల‌ర్ చిత్రం. క‌డుపుబ్బ న‌వ్వించే కామెడీ కూడా ఉంటుంది. అంత‌ర్లీనంగా చిన్న సందేశం కూడా ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాం. విజ‌య్ బాల‌జీ ఒక పాట‌తో పాటు అద్భుత‌మైన నేప‌థ్య సంగీతం స‌మ‌కూర్చారు. సినిమాటోగ్ర‌ఫీ కూడా బాగా కుదిరింది“ అన్నారు.
నిర్మాత విశ్వ‌నాథ్ త‌న్నీరు మాట్లాడుతూ….“ద‌ర్శ‌కుడు చెప్పిన క‌థ న‌చ్చి ఈ చిత్రాన్ని నిర్మించ‌డానికి ముందుకొచ్చాను. చెప్పిన‌దాని క‌న్నా ద‌ర్శ‌కుడు అద్భుతంగా తెర‌కెక్కించారు. మా హీరో మారుతికిది తొలి సినిమా అయినా ఎంతో అనుభవం ఉన్న హీరోలా చేశాడు. మా ప్ర‌య‌త్నాన్ని ప్రేక్ష‌కులు ఆశీర్వ‌దిస్తార‌ని ఆశిస్తున్నా“ అన్నారు.
హీరో మారుతి మాట్లాడుతూ…“ఇది నా తొలి సినిమా. నేను న‌ట‌న నేర్చుకోలేదు. ద‌ర్శ‌కుడు చె ప్పిన‌ట్లు ఫాలో అయ్యాను. మా నిర్మాత ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా సినిమా నిర్మించారు. విజ‌య్ బాలాజీ గారు సంగీతం ఆకట్టుకునే విధంగా ఉంటుంది“అన్నారు.
గోవింద‌, హ‌రిత‌, వంశీ, ఇంద్ర‌తేజ‌,  ర‌హీం (రాకేష్ బాబు), ముర‌ళి త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి సంగీతంః విజ‌య్ బాలాజి; ఎడిటింగ్ః వంశీ కందాల‌;  సినిమాటోగ్ర‌ఫీః మ‌హ్మ‌ద్ రియాజ్‌;  సౌండ్ ఇంజ‌నీర్ః విష్ణు; స‌మ‌ర్ప‌ణః శ్రీమ‌తి పార్వ‌తి;  నిర్మాత‌లుః విశ్వ‌నాథ్ తన్నీరు, సురేష్‌.ఎస్‌; ద‌ర్శ‌కత్వంః జై రామ్ వ‌ర్మ‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here