హీరో నిఖిల్ ‘కిర్ర్రక్ పార్టీ’ ఫస్ట్ లుక్ విడుదల

Nikhil Kirik Party First Look Poster

ఏ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిఖిల్ హీరోగా వస్తున్న ‘కిర్ర్రక్ పార్టీ’ ఫస్ట్ లుక్ విడుదలైనది. ‘కిర్ర్రక్ పార్టీ’ నిఖిల్ 15 వ చిత్రంకాగా, ఏ.కె.ఎంటర్టైన్మెంట్స్ వారి ప్రొడక్షన్ No. 11 కావడం విశేషం. కాలేజీ బ్యాక్ డ్రాప్ లో సాగే చిత్రం కావడంతో చాలావరకు కొత్త నటీనటులను ఎంపిక చేసారు నిర్మాతలు. క్యాస్టింగ్ కాల్ ఇవ్వగా సుమారు 60 వేల అప్లికేషన్ లు రాగా ఆడిషన్స్ చేసి కొంతమంది యువ నటి నటులను సెలెక్ట్ చేసారు. 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంతో శరన్ కొప్పిశెట్టి దర్శకునిగా పరిచయం కాబోతున్నారు. నిఖిల్ తో ‘స్వామి రారా’ తీసిన సుదీర్ వర్మ స్క్రీన్ ప్లే  అందించగా, డైలాగ్స్ ‘కార్తికేయ’ దర్శకుడు చందూ మొండేటి రాసారు. సంయుక్త హెగ్డే మరియు సిమ్రన్ పరీన్జా హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ చిత్తానికి రామబ్రహ్మం సుంకర నిర్మాత.
తారాగణం: నిఖిల్, సంయుక్త హెగ్డే, సిమ్రన్ పరీన్జా
దర్శకుడు- శరన్ కొప్పిశెట్టి
సంగీతం: అజనీష్ లోకనాథ్
మాటలు: చందూ మొండేటి
స్క్రీన్ ప్లే: సుధీర్ వర్మ
ఛాయాగ్రహం – అద్వైత గురుమూర్తి
ఎడిటర్: ఎం.ఆర్. వర్మ
ఆర్ట్: అవినాష్
కో-డైరెక్టర్: సాయి దాసం
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కిషోర్ గరికిపాటి
కో-ప్రొడ్యూసర్స్: అజయ్ సుంకర – అభిషేక్ అగర్వాల్
నిర్మాత: రామబ్రహ్మం సుంకర

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here