హెబ్బా.. ఇట్టాగైతే ఎట్ట‌బ్బా..!


ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కొత్త‌లో మెరుపుతీగ‌ల్లా క‌నిపిస్తారు. ఆ త‌ర్వాత ఇండ‌స్ట్రీ నీళ్లు బాగా ఒంట‌బ‌ట్టి బొద్దుగా మారిపోతుంటారు. కొంద‌రు హీరోయిన్లు చూడ్డానికి బొద్దుగా ఉన్నా బాగానే ఉంటారు. కానీ కొంద‌రు మాత్రం బొద్దుగా ఉంటే అస్స‌లు చూడ‌లేం. హెబ్బాప‌టేల్ ఇప్పుడు ఇలాగా తయారైంది. కెరీర్ మొద‌ట్నుంచీ ఈ భామ స‌న్న‌గా మాత్రం లేదు. కానీ మ‌రీ చూడ్డానికి ఎబ్బెట్టుగా కూడా లేదు.
కానీ ఇప్పుడు ఆ రూపంలోకి వ‌చ్చేస్తుంది. హీరోయిన్ అన్న త‌ర్వాత అవ‌కాశాల కోసం ఎంత వేచి చూస్తారో.. ఫిజిక్ మీద కూడా అంతే దృష్టి పెడ‌తారు. ఒక్క‌సారి బాడీపై కంట్రోల్ పోయిందంటే ఇక వాళ్ల‌ను చూడ‌టం క‌ష్టం. గ‌తంలో ఆర్తిఅగ‌ర్వాల్, న‌మిత లాంటి హీరోయిన్లు చూస్తుండ‌గానే లావుగా మారిపోయి కెరీర్ నాశ‌నం చేసుకున్నారు. ఇప్పుడు హెబ్బాప‌టేల్ ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఈ బ్యూటీ ప్ర‌స్తుతం 24 కిస్సెస్ సినిమాలో న‌టిస్తుంది.
దాంతో పాటే ఈ మ‌ధ్యే ఫోటోషూట్ ఒక‌టి చేసింది హెబ్బాప‌టేల్. ఇందులో హెబ్బాను చూసి షాకయ్యారు ఫ్యాన్స్. అస‌లు కుమారి 21 ఎఫ్ లో క‌నిపించిన అమ్మాయేనా ఈమె అనుకుంటున్నారు. ఈ సినిమాలో మ‌రీ లావుగా క‌నిపించింది హెబ్బా ప‌టేల్. ఈ ఫిజిక్ ఇలాగే ఉంటే హెబ్బా కెరీర్ కు అది ప్ర‌మాదం. వీలైనంత త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గ‌క‌పోతే హెబ్బ‌పటేల్ కెరీర్ కూడా బ‌రువుగా మార‌డం ఖాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here