హ్యాపీ బ‌ర్త్ డే టూ సూప‌ర్ స్టార్..

MAHESH 44th BIRTHDAY
రాజ‌కుమారుడిగా వ‌చ్చి.. యువ‌రాజుగా మారి.. మురారిగా అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుని.. ట‌క్కరిదొంగ‌లా అంద‌రి మ‌న‌సులు దోచేసిన ఒక్క‌డు మ‌న పోకిరి. అత‌డు ఏం చేసినా దూకుడు త‌గ్గ‌దు. ఒక‌ప్పుడు మూడేళ్ల‌కోసారి అతిథిలా సినిమాలు చేసినా.. ఇప్పుడు మాత్రం ఏడాదికి రెండు సినిమాలు చేసే సినిమా సైనికుడిగా మారాడు. అత‌డే మ‌న సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు. ఆగ‌స్ట్ 9 ఈయ‌న పుట్టిన‌రోజు. నేటితో 44 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు మ‌హేశ్ బాబు.
ప్రిన్స్ అంటూ ముద్దుగా పిలుచుకున్నా.. సూప‌ర్ స్టార్ అంటూ ఆకాశానికి ఎత్తేసినా మ‌హేశ్ మాత్రం ఎప్పుడూ నేల‌మీదే ఉంటాడు. ఈ మ‌ధ్యే 19 ఏళ్ళ హీరో కెరీర్ ను పూర్తి చేసుకున్న మ‌హేశ్.. ఇప్పుడు 20వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు.
వ‌య‌సులోనూ 44వ ఏట ప‌డుతున్నాడు. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌స్తుతం త‌న 25వ సినిమా చేస్తున్నాడు మ‌హేశ్ బాబు. దీనికి రిషి అనే టైటిల్ క‌న్ఫ‌ర్మ్ చేసాడు ఈ ద‌ర్శ‌కుడు.
రైతుల నేప‌థ్యంలో ఈ చిత్ర క‌థ తెర‌కెక్కుతుంది. ఇందులో మ‌హేశ్ విదేశీ కంపెనీ సిఈఓగా న‌టిస్తున్నాడు. అలాగే కాలేజ్ స్టూడెంట్ గానూ క‌నిపించ‌నున్నాడు. అల్ల‌రి న‌రేష్ ఇందులో మ‌హేశ్ స్నేహితుడిగా న‌టిస్తున్నాడు. బ‌ర్త్ డే కానుక‌గా ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసాడు ద‌ర్శ‌కుడు వంశీ. దిల్ రాజు, పివిపి, అశ్వినీద‌త్ సంయుక్తంగా రిషి సినిమాను నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here