హ‌ను కామెడీ చేస్తాడంట‌.. చూడాలిక‌..!

Sharwanand, Sai Pallavi For Hanu Raghavapudi Directorial Film In Sri Lakshmi Venkateswara Cinemas Banner
ఇండ‌స్ట్రీలో క్రేజ్ రావాలంటే హిట్ కొట్టాల్సిందే.. ద‌ర్శ‌కుల‌కు అయితే మ‌రో షార్ట్ క‌ట్ కూడా ఉండ‌దు. కానీ హ‌ను రాఘ‌వ‌పూడి విష‌యంలో మాత్రం ఇది జ‌రగ‌డం లేదు. ఈయ‌న ఫ్లాప్ ఇచ్చినా కూడా హీరోలు బాగానే ఆఫ‌ర్లు ఇస్తున్నారు ఈ ద‌ర్శ‌కుడికి. ఇప్పుడు మ‌రో హిట్ హీరో పిలిచి మ‌రీ ఆఫ‌ర్ ఇచ్చాడు. అత‌డే శ‌ర్వానంద్. ఈ మ‌ధ్యే లై లాంటి డిజాస్ట‌ర్ ఇచ్చాడు ఈ ద‌ర్శ‌కుడు. కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథతో ఫామ్ లోకి వ‌చ్చిన హ‌ను.. లైతో దారుణంగా ఫెయిల‌య్యాడు. ఈ చిత్రానికి టాక్ బాగానే వ‌చ్చినా.. క‌లెక్ష‌న్లు మాత్రం రాలేదు. కాక‌పోతే హ‌ను టేకింగ్ కు మాత్రం మంచి మార్కులు ప‌డుతున్నాయి. సుకుమార్ త‌రహాలో ఆప‌రేష‌న్ స‌క్సెస్.. పేషెంట్ డెడ్ అయింది లై. అందుకే హ‌నుతో ప‌ని చేయ‌డానికి హీరోలు ఇష్ట‌ప‌డ‌తారు. ఎందుకంటే డిఫెరెంట్ సినిమా ఇస్తాడు కాబ‌ట్టి. వ‌ర‌స విజ‌యాల శ‌ర్వానంద్ తో హ‌ను రాఘ‌వ‌పూడి త‌ర్వాతి సినిమా చేయ‌బోతున్నాడు. ఈ చిత్రం పూర్తిస్థాయి కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్క‌నుంది. ఇందులో సాయిప‌ల్ల‌వి హీరోయిన్ కావ‌డం మ‌రో విశేషం. ఇప్ప‌టి వ‌ర‌కు శ‌ర్వా, సాయిప‌ల్ల‌వి కెరీర్ లో ఎన్న‌డూ లేనంత కామెడీ ఈ చిత్రంలో ఉండ‌బోతుంద‌ని తెలుస్తుంది. జ‌న‌వ‌రి మూడో వారంలో ఈ చిత్రం నేపాల్ లో మొద‌లు కానుంది. మ‌రి చూడాలిక‌.. కామెడీ ఎలా ఉండ‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here