హ‌లో.. ఎక్క‌డో తేడా కొడుతుందిగా..!

HELLO Designs
మొన్న విడుద‌లైన రెండు సినిమాల్లో ఏది బెట‌ర్ అంటే నూటికి 80 మంది చెప్పే మాట హ‌లో. ఎందుకంటే ఎంసిఏ బాలేదు అని కాదు.. అది రొటీన్ క‌థ. ఎప్పుడూ చూసే సినిమానే. కానీ హ‌లో అలా కాదు. ఫ్రెష్ ఫీలింగ్ తెప్పిస్తూ.. మ‌న‌సును క‌దిలించే ప్రేమ‌క‌థ‌. పైగా అఖిల్ లాంటి కుర్ర హీరో ఈ చిత్రంలో ఉన్నాడు. కానీ ప్రేక్ష‌కులు మాత్రం హ‌లో కంటే మిడిల్ క్లాస్ ఎమోష‌న్ల‌కే ఎక్కువ‌గా క‌నెక్టవుతున్నారు. ఆ సినిమా వైపు అడుగేస్తున్నారు. ఇప్పుడు ఎంసిఏకు వ‌స్తున్న వ‌సూళ్లు.. హ‌లోకు వ‌స్తున్న క‌లెక్ష‌న్లు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. హ‌లో పాజిటివ్ టాక్ తెచ్చుకుని కూడా వ‌సూళ్ల వేట‌లో వెన‌క‌బ‌డిపోయింది. ఈ చిత్రం తొలిరోజు కేవ‌లం 3.10 కోట్ల‌తో స‌రిపెట్టుకుంది. ఇక రెండో రోజైతే తెలుగు రాష్ట్రాల్లో కేవ‌లం 1.83 కోట్లు మాత్ర‌మే వ‌సూలు చేసింది. మూడో రోజు కూడా ఇంతే ఉంది. మ‌రోవైపు ఎంసిఏ నాలుగో రోజు కూడా తెలుగు రాష్ట్రాల్లోనే 3.81 షేర్ వ‌సూలు చేసింది. కానీ హ‌లో మాత్రం ఇందులో స‌గం కూడా తీసుకురాలేదు. ఈ లెక్క‌న అఖిల్ మ‌రోసారి ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌డంలో ఫెయిల్ అయ్యాడేమో అనిపిస్తుంది. ఆయ‌న‌కు ఇది ప‌ర్ ఫెక్ట్ రీ లాంఛ్ అవుతుంది. కానీ క‌మ‌ర్షియ‌ల్ గా మాత్రం కోరుకున్న విజ‌యం కోసం ఇంకొన్నాళ్లు ఆగాల్సి వ‌చ్చేలా క‌నిపిస్తుంది. హ‌లోలో అఖిల్ కు డాన్సులు.. ఫైట్లు అన్నింటికీ మించి ల‌వ్.. ఇవ‌న్నీ హ‌లోలో స‌రిగ్గా ప‌డ్డాయి.
తెలుగు రాష్ట్రాల్లో కాస్త నెమ్మ‌దిగా ఉన్నా.. ఓవ‌ర్సీస్ లో హ‌లో దున్నేస్తుంది. అక్క‌డ ఎంసిఏను కూడా ప‌క్క‌కు నెట్టేస్తుంది ఈ చిత్రం. ఇప్ప‌టికే 6 ల‌క్ష‌ల డాల‌ర్లు వ‌సూలు చేసింది హ‌లో. అక్క‌డ అఖిల్ కు మంచి ఇమేజ్ తీసుకొస్తుంది ఈ చిత్రం. సినిమాలో ముఖ్యంగా రొమాంటిక్ ట్రాక్ మ్యాజిక్ చేసాడు విక్ర‌మ్. ఇక అఖిల్ అమ్మ‌గా ర‌మ్య‌కృష్ణ ప‌ర్ఫార్మెన్స్ సినిమాకు ప్రాణం. ఆమె నెక్ట్స్ లెవ‌ల్ కి సినిమాను తీసుకెళ్లిపోయింది. అఖిల్, ర‌మ్యకృష్ణ మ‌ధ్య వ‌చ్చే సీన్స్ అన్నీ సినిమాలో చాలా బాగా పండాయి. తొలి మూడు రోజుల్లో 7.7 కోట్ల‌కు పైగానే వ‌సూలు చేసింది ఈ చిత్రం. పాజిటివ్ టాక్ ఉంది. దాంతో మెల్ల‌గా క‌లెక్ష‌న్లు పుంజుకుంటాయ‌ని ఆశిస్తున్నాడు నాగార్జున‌. లాంగ్ వీకెండ్.. క్రిస్మ‌స్ హాలీడేస్ ఉండ‌టంతో మ‌రో వారం రోజుల పాటు హ‌లోకు పెద్ద‌గా అడ్డంకులేమీ ఉండ‌క‌పోవ‌చ్చు. అన్నీ దాటుకుని క‌మ‌ర్షియ‌ల్ గానూ హ‌లో మంచి విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నాడు నాగార్జున‌. హ‌లో హిట్ అనిపించుకోవాలంటే 32 కోట్లు వ‌సూలు చేయాలి. మ‌రి అంత దూరం హ‌లో ప్ర‌యాణిస్తుందో లేదో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here