అఖిల్ అక్క‌డ ప‌ని పూర్తిచేసాడు..

AKHIL 3 LONDON SCHEDULE COMPLETED
అస‌లే రెండు వ‌ర‌స ఫ్లాపుల‌తో కెరీర్ లో ఎటూ కాకుండా ఉన్నాడు అఖిల్. హ‌లో త‌ర్వాత ఆర్నెళ్లు గ్యాప్ తీసుకుని వెంకీ సినిమా మొద‌లుపెట్టాడు ఈ కుర్ర హీరో. ఇప్పుడు ఈ చిత్ర షూటింగ్ జెట్ స్పీడ్ లో పూర్తవుతుంది. తాజాగా లండ‌న్ షెడ్యూల్ కూడా పూర్తైపోయింది. ముందు నుంచీ కూడా ఈ చిత్రాన్ని ద‌స‌రాకు విడుద‌ల చేయాల‌నేది అఖిల్ ప్లాన్. అలాగే వెంకీ అట్లూరి కూడా ఈ ప్లానింగ్ తోనే షెడ్యూల్స్ వేసుకున్నాడు.
లండ‌న్ లో గ‌త 45 రోజులుగా జ‌రుగుతున్న నాన్ స్టాప్ షెడ్యూల్ కు ఇప్పుడు ఫుల్ స్టాప్ ప‌డింది. అక్క‌డ షూటింగ్ పూర్తి చేసుకుని ఇండియాకు వ‌చ్చేస్తున్నారు టీం. చిన్న బ్రేక్ తీసుకుని హైద‌రాబాద్ లో మ‌రో భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు. స‌వ్య‌సాచి ఫేమ్ నిధి అగ‌ర్వాల్ ఇందులో అఖిల్ తో జోడీ క‌ట్టింది. ద‌స‌రాకు ఎన్టీఆర్-త్రివిక్ర‌మ్ అర‌వింద స‌మేత కూడా రానుంది. ఇప్ప‌టి వ‌ర‌కు అయితే ద‌స‌రా అని అఖిల్ అనౌన్స్ చేయ‌లేదు కానీ షూట్ జ‌రుగుతున్న స్పీడ్ చూస్తుంటే పండ‌క్కి వ‌చ్చినా ఆశ్చ‌ర్య‌పోన‌క్కర్లేదు. మ‌రి చూడాలి.. ఈ చిత్రంతోనైనా అఖిల్ హిట్ కొడ‌తాడో లేదో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here