‘అనగనగా ఓ ప్రేమకథ’ ప్రారంభం

ప్రముఖ నిర్మాత డి వి ఎస్ రాజు గారి అల్లుడు కె. ఎల్.ఎన్ రాజు గారు గత ౩౦ సంవత్సరాలుగా సినిమా రంగంలో ప్రముఖ నిర్మాతలకు ఫైనాన్షియర్ గా పేరుపొంది ఉన్నారు . చాలా రోజుల తర్వాత నిర్మాత గా
Thousand Lights Media Pvt Ltd  అనే బ్యానర్ ను స్థాపించి ‘అనగనగా ఓ ప్రేమకథ’ అనే చిత్రాన్ని  నిర్మిస్తున్నారు.
ఈ రోజు (25-11 -2017  శనివారం)   నిర్మాత కె.ఎల్.ఎన్  రాజు గారి నివాసంలో పూజా కార్యక్రమాలు నిర్వహించ బడ్డాయి. 


ప్రముఖ దర్శకులు ఎన్. శంకర్ గారి వద్ద అసోసియేట్ గా పనిచేసిన టి.ప్రతాప్ గారు ఈ చిత్రం ద్వారా నూతన దర్శకునిగా పరిచయం అవుతున్నారు.
ఈ చిత్రానికి హీరో గా ప్రముఖ ఎడిటర్ మార్తాండ్.కె . వెంకటేష్ గారి మేనల్లుడు విరాజ్ జె అశ్విన్ ను పరిచయం చేస్తున్నారు. ఈ చిత్రానికి హీరోయిన్ లుగా రిద్ధి కుమార్ మరియు రాధా బంగారు పరిచయమవుతున్నారు
ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత కె.ఎల్.ఎన్ రాజు గారు క్లాప్ కొట్టారు. సీనియర్ ఫైనాన్షియర్ సత్యరంగయ్య గారు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ గారు గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత కె.ఎల్.ఎన్. రాజు గారు స్క్రిప్ట్ ని దర్శకుడు ప్రతాప్ గారికి అందజేశారు
చిత్ర నిర్మాత కె ఎల్ ఎన్ రాజు గారు మాట్లాడుతూ..,Thousand Lights Media అనే బ్యానర్ ని స్థాపించి ఈ సినిమా ధ్వారా నూతన హీరో హీరోయిన్ లను పరిచయం చేస్తున్నాం ., ప్రతాప్ గారు ఈ సినిమా ధ్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.ఓ మంచి కథతో రూపొందుతున్న ఈ చిత్రం విజయంసాధించాలని ఆశిస్తున్నాను అని తెలిపారు.
దర్శకుడు ప్రతాప్ మాట్లాడుతూ.. కె ఎల్ ఎన్ రాజు గారు బ్యానర్ స్థాపించి మొట్టమొదటి సినిమా నాకు దర్శకుడిగా అవకాశం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది  అన్నారు
హీరో విరాజ్ జె అశ్విన్ మాట్లాడుతూ ఈ  సినిమా ద్వారా హీరో గా పరిచయం అవుతున్నందుకు ఆనందంగా ఉంది అన్నారు
హీరోయిన్ లు కూడా తమ హర్షాన్ని వ్యక్తం చేశారు
ఈ సినిమా లో హీరో తండ్రిగా నటిస్తున్న దర్శకుడు నటుడు కాశి విశ్వనాధ్ గారు మాట్లాడుతూ కథ చాలా ఫ్రెష్ గా ఉంది. ఈ సినిమా తో అందరికి పేరు రావాలని కోరుకుంటున్న అని చెప్పారు

నాయక,నాయికలుగా విరాజ్.జె.అశ్విన్., రిధి కుమార్, రాధా బంగారు పరిచయం అవుతుండగా. ఇతర ప్రధాన పాత్రలలో కాశీ విశ్వనాధ్,అనీష్ కురువిల్ల, వేణు తిళ్ళు నటిస్తున్నారు. 
ఛాయాగ్రహణం; ఎదురొలు రాజు,
సంగీత ; కృష్ణ చేతన్ టి.ఆర్. 
ఎడిటింగ్; మార్తాన్డ్ కె వెంకటేష్ 
పాటలు; శ్రీమణి
ఆర్ట్; రామాంజనేయులు 
ఫైట్స్: రామకృష్ణ 
నృత్యాలు: యస్వంత్ 
ప్రొడక్షన్ కంట్రోలర్ : బెక్కెం రవీందర్ 
నిర్మాత: కె.ఎల్.ఎన్. రాజు 
దర్శకుడు : ప్రతాప్. టి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here