అనుకున్న‌దే.. అజ్ఞాత‌వాసి ఆల్ టైమ్ రికార్డులు..

Agnyaathavaasi
 
 
 
 
 
 
అవునా.. అజ్ఞాత‌వాసి ఆల్ టైమ్ రికార్డులు సెట్ చేసాడా..? ఏమైనా పిచ్చి ప‌ట్టిందా ఏంటి.. ఓ వైపు సినిమా డిజాస్ట‌ర్ అంటుంటే మ‌రోవైపు ఆల్ టైమ్ రికార్డులు ఏంటి అనుకుంటున్నారా..? అవును మ‌రి.. రికార్డులంటే ఎప్పుడూ మంచివే ఉండ‌వు.. అప్పుడ‌ప్పుడూ చెత్త రికార్డులు కూడా వ‌స్తుంటాయి. వాటిని కూడా భ‌రించాల్సిందే. ఇప్పుడు అజ్ఞాత‌వాసికి వ‌చ్చింది ఇదే. అజ్ఞాత‌వాసి చ‌రిత్ర‌లో నిలిచిపోయింది. ఎంతైనా 25వ సినిమా క‌దా.. మ‌రోలా ఇది చ‌రిత్ర సృష్టించింది. న‌ష్టాల్లో ఈ చిత్రం టాలీవుడ్ లోనే రెండో అతిపెద్ద డిజాస్ట‌ర్ గా నిలిచింది. తొలి స్థానంలో స్పైడ‌ర్ ఉన్నాడులే.. కంగారు ప‌డాల్సిన ప‌ని లేదు. అజ్ఞాత‌వాసి ఫైన‌ల్ ర‌న్ లో 57.5 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. ప్ర‌పంచ వ్యాప్తంగా 98 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసింది. అయితే సినిమా రేంజ్ కు ఇది స‌రిపోదు. నాన్ బాహుబ‌లి కేట‌గిరీలో ఇప్ప‌టి వ‌ర‌కు ఏ తెలుగు సినిమా చేయ‌ని బిజినెస్ చేసింది ఈ చిత్రం. సౌత్ లో 150 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ దాటిన మూడు సినిమాల్లో ఇది కూడా ఒక‌టి. దీనికి ముందు స్పైడ‌ర్.. మెర్స‌ల్ ఉన్నాయి. ఆ అంచ‌నాలు అందుకున్న సినిమా మెర్స‌ల్ మాత్ర‌మే. ఈ చిత్రం 244 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూలు చేసింది.
ఇక అజ్ఞాతవాసి మాత్రం అడ్డంగా బ‌య్య‌ర్ల‌ను ముంచేయ‌డానికి రెడీ అయిపోయింది. అస‌లు 120 కోట్ల బిజినెస్ చేసిన సినిమాను ఇంత దారుణంగా ఎలా తీస్తారు.. అని ప్ర‌శ్నిస్తున్నారు మ‌న‌సు మండిన అభిమానులు. ప‌వ‌న్ 25వ సినిమా క‌దా అని కోట్లాది ఆశ‌ల‌తో వ‌చ్చిన అభిమానుల ఆశ‌ల‌పై నిండా నీళ్లు పోసారు ప‌వ‌న్ అండ్ త్రివిక్ర‌మ్. ఏం చేసినా చూస్తారులే అనే అతి విశ్వాస‌మే ఇప్పుడు అజ్ఞాత‌వాసి కొంప ముంచేసిందేమో అనిపిస్తుంది కాస్త లోతుగా జాగ్ర‌త్త‌గా ఆలోచిస్తే..! ఈ పాపం ఎవ‌రిది అయినా కానీ ఇప్పుడు మునిగేది మాత్రం బ‌య్య‌ర్లే. ఈ చిత్రం ఫైన‌ల్ రన్ 57.5 కోట్ల ద‌గ్గ‌రే ఆగిపోయింది. అంటే నిక‌రంగా 67 కోట్ల వ‌ర‌కు న‌ష్టాలు త‌ప్ప‌లేదు. మ‌రి ఈ న‌ష్టాల‌ను ఎవ‌రు భ‌రిస్తారు..? ప‌వ‌న్ కానీ.. త్రివిక్ర‌మ్ కానీ త‌మ డ‌బ్బుల‌ను వెనక్కిస్తారా.. లేదంటే అంత రేట్ పెట్టి ఎవ‌డు కొన‌మన్నాడు అంటూ గాలికి వ‌దిలేస్తారా చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here