అనుష్కకు సినిమాలంటే ఇష్టం లేదా.. ఆసక్తి లేదా..? లేదంటే కెరీర్ ఇక చాలనుకుంటుందా..? ఇవన్నీ ఇప్పుడు ఈమె అభిమానులు వేస్తోన్న ప్రశ్నలే..! అనుష్క విషయంలో అసలేం జరుగుతుందో తెలియట్లేదు. సినిమాలు ఎందుకు ఒప్పుకోవడం లేదో.. ఎందుకు ప్రేక్షకుల ముందుకు రావడం లేదో అన్నీ చెప్పేసింది ఈ భామ. భాగమతి తర్వాత ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా సైన్ చేయలేదు అనుష్క. తాను సినిమాలకు దూరం కానున్న మాట అవాస్తవం అని.. అయితే బ్రేక్ మాత్రం తీసుకుంటున్నాని చెప్పింది ఈ భామ. ఆ మధ్య గౌతమ్ మీనన్ సినిమా ఒప్పుకున్నా అది ఎప్పటికి పట్టాలెక్కేనో ఆయనకే తెలియదు.
పైగా బరువు విషయంలోనూ ఇప్పటికీ అనుష్క అలాగే ఉంది. వయసు కూడా 36 ఏళ్లు రావడంతో కుర్ర హీరోలకు సరిపోయే ఫిజిక్ కాదు. స్టార్ హీరోలు కూడా అనుష్కతో రొమాన్స్ అంటే ఇప్పుడు ఎందుకులే అంటున్నారు. ఇప్పటికీ అనుష్క నార్మల్ అవతారంలోకి మారలేదు. ఆంటీలా మారిపోయింది. ఈ రూపంతోనే బాహుబలి 2, ఓం నమో వెంకటేశాయా, సింగం 3 షూటింగ్ పూర్తి చేసారు దర్శక నిర్మాతలు. అనుష్క బరువు తగ్గించడానికే బాహుబలి 2 లో స్పెషల్ గ్రాఫిక్స్ ను కూడా వాడుకున్నారు. ఇక ఇప్పుడు తన కెరీర్ కోసం త్యాగం చేయడం మొదలుపెట్టింది అనుష్క. అంటే చిన్న సినిమాలకు ఓకే చెప్పేస్తుందన్నమాట.
ఇప్పటి వరకు అనుష్క సినిమా అంటే భారీ అంచనాలుండేవి..
భారీ క్యాస్టింగ్ కూడా ఉండేది.. అన్నింటికి తోడు బడ్జెట్ భారీగా ఉండేది. కానీ ఇప్పుడు ఈమె ఒప్పుకున్న సినిమాల లిస్ట్ చూస్తుంటే అవేవీ కనిపించడం లేదు. మాధవన్ హీరోగా కోనవెంకట్ నిర్మాణంలో ఓ సినిమా రాబోతుంది. హేమంత్ అనే కొత్త దర్శకుడు దీన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో అనుష్క హీరోయిన్ గా నటించబోతుంది. కెరీర్ మొదట్లో రెండు సినిమాలో మ్యాడీతో రొమాన్స్ చేసింది అనుష్క. ఇక ఆది పినిశెట్టితో ఓ సినిమా.. నా నువ్వే నిర్మాతలు కూల్ బ్రీజ్ ప్రొడక్షన్ లో ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి తన ఇమేజ్ ను పక్కనబెట్టి మరీ చిన్న సినిమాలకు ఓకే చెప్పేస్తుంది అనుష్క.