శ్రీ‌కాంత్ తో టైమ్ చూసి ఆడుకుంటున్నారుగా..!


శ్రీ‌కాంత్ సినిమా అంటే హీరో శ్రీ‌కాంత్ కాదండీ బాబూ..! ద‌ర్శ‌కుడు శ్రీ‌కాంత్.. శ్రీ‌కాంత్ అడ్డాల‌. రెండేళ్ల కింద బ్ర‌హ్మోత్స‌వంతో డిజాస్ట‌ర్ ఇచ్చాడు ఈ ద‌ర్శ‌కుడు. ఆ త‌ర్వాత క‌నిపించ‌డ‌మే మానేసాడు. ఆ మ‌ధ్య ఎప్పుడో డిజే ఆడియో వేడుక‌లో త‌న సంస్థ‌లో ప‌ని చేసిన ద‌ర్శ‌కులంద‌ర్నీ ఒకేచోట చేర్చాడు దిల్ రాజు.
అప్పుడు చూసిందే ఈ ద‌ర్శ‌కున్ని.. మ‌ళ్లీ ఇప్ప‌టి వ‌ర‌కు బ‌య‌ట క‌న‌బ‌డ‌లేదు. బ్ర‌హ్మోత్స‌వం ఇచ్చిన షాక్ తో ఈయ‌న వైపు చూడ్డానికి కూడా నిర్మాత‌లు సాహ‌సించ‌డం లేదు. ఒక్క‌టి రెండు కాదు.. ఏకంగా 35 కోట్ల‌కు పైగా న‌ష్టాలు తీసుకురావ‌డంతో శ్రీ‌కాంత్ అడ్డాల‌పై న‌మ్మ‌కాల‌న్నీ పోయాయి. బ్ర‌హ్మోత్స‌వం త‌ర్వాత మ‌నోడు ఏ సినిమాకు కూడా క‌మిట్ కాలేదు.
ఆ మ‌ధ్య మెగా కుటుంబంలో ఉన్నాడ‌ని..
అక్క‌డ అల్లు శిరీష్ తో సినిమాకు సిద్ధ‌మ‌వుతున్నాడ‌నే వార్త‌లు వ‌చ్చాయి. గీతాఆర్ట్స్ లోనే సినిమా ఉంటుంద‌నుకున్నారు కానీ శిరీషే లేద‌ని చెప్ప‌డంతో ఆశ‌లు ఆవిరైపోయాయి. ఇక దిల్ రాజు బ్యాన‌ర్ లోనూ సినిమా కోసం చూస్తున్నాడు శ్రీకాంత్ అడ్డాల‌. ఈయ‌న‌కు కొత్త బంగారు లోకం.. సీత‌మ్మ వాకిట్లో లాంటి సినిమాలు ఇచ్చాడు ఈ ద‌ర్శ‌కుడు. ఆ న‌మ్మ‌కంతోనే మంచి క‌థ రాసుకొని వెళ్తే రాజుగారు ఛాన్సిస్తార‌ని న‌మ్ముతున్నాడు ఈయ‌న‌. కానీ ఆ మంచి క‌థ కుద‌ర‌డం లేదు. శ‌ర్వానంద్ కోసం కూడా ఆ మ‌ధ్య ట్రై చేసినా ఈయ‌న‌తోనూ ప్రాజెక్ట్ వ‌ర్క‌వుట్ కాలేదు. మొత్తానికి టైమ్ చూసి శ్రీ‌కాంత్ అడ్డాల‌తో ఫుట్ బాల్ ఆడుకుంటున్నారు మ‌న నిర్మాత‌లు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here