అమీషా.. అందాల‌తో మాయేనా హ‌మేషా..?

18 ఏళ్ల కింద తెలుగు ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన ముద్దుగుమ్మ అమీషా ప‌టేల్. అప్ప‌ట్లో బ‌ద్రి సినిమాలో ప‌వ‌న్ తో రొమాన్స్ చేసింది ఈ భామ. తెలుగులో ఈ పేరుకు పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. హిందీలో క‌హో నా ప్యార్ హై లాంటి సినిమాతో అడుగు పెట్టిన అమీషా.. కొన్నాళ్లు అక్క‌డ బాగానే వెలిగింది.  తెలుగులోనూ నాని, న‌ర‌సింహుడు, ప‌ర‌మ వీర‌చ‌క్ర లాంటి సినిమాల్లో న‌టించింది. కానీ బద్రి మిన‌హా అన్నీ డిజాస్ట‌ర్లే. వ‌య‌సు 40 దాటేసింది. దాంతో ఆటోమేటిక్ గా అవ‌కాశాలు కూడా దూరం అవుతున్నాయి. త‌న తోటి హీరోయిన్లు ఐశ్వ‌ర్యారాయ్.. విద్యాబాల‌న్ లాంటి వాళ్లు 40స్ లోనూ ఇంకా ఆఫ‌ర్లు సాధిస్తుండ‌టంతో తాను కూడా అదే ప‌ని చేయాల‌ని చూస్తుంది అమీషా ప‌టేల్. అందుకే త‌న వ‌య‌సు కూడా మ‌రిచిపోయి అందాలు ఆర‌బోస్తుంది. తాజాగా ఫోటోషూట్ చేసిన అమీషా.. అందులో అందాల త‌మాషా చేసింది. క్లీవేజ్ షోల‌తో మ‌తులు పోగొట్టేసింది. ఈ భామ జోరు చూస్తుంటే కుర్ర హీరోయిన్లు కూడా వామ్మో అంటూ ముక్కున వేలేసుకోవాల్సిందే..! మొత్తానికి ఏజ్ పెరిగినా.. గ్లామ‌ర్ షోలో మాత్రం త‌న‌ను కొట్టే వాళ్లే లేర‌ని నిరూపించే ప‌నిలో బిజీగా ఉంది అమీషా ప‌టేల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here