అమెరికా వాసులను హడలెత్తిచిన మెరుపు

గ్రహాంతరవాసుల ఉనికి పై ఎప్పటినుండో ఖగోళ శాస్త్రజ్ఞులు పరిశోధనలు జరుపుతూ ఉన్నారు. అయితే హాలీవుడ్ లో మాత్రం అనేక చిత్రాలు ఈ నేపథ్యంలో తీస్తూనే ఉన్నారు. అమెరికా ను తరచూ గ్రహాంతరవాసులు సందర్శిస్తుంటారని 45 % అమెరికన్ లు నమ్ముతారని అధ్యయనంలో తేలింది. అక్కడి ప్రభుత్వం చాల కాలం నుండి ఏరియా 51 అనే రహస్య స్థావరంలో భూమిపై పడిన ఎగిరే పళ్ళాలు (ఫ్లైయింగ్ సాసర్స్) వాటిలో ప్రయాణించిన గ్రహాంతరవాసుల పై పరిశోధనలు జరుపుతున్నారనే పుకారు ఉంది.

ఈ క్రమంలో నిన్న సాయంత్రం లాస్ ఏంజెల్స్ లో ఏదో మెరుపు ఆకాశం లో కనిపించంగా కొన్ని నిమిషాలపాటు అందరు భూమిమీదకి గ్రహాంతరవాసులు వచ్చారు అనుకోని వణికిపోయారట. మరి కొందరు అయితే టీవీ చానెల్స్ కి ఫోన్ చేసి మెరుపు ఏంటి అని ఆరాలు తీసారట. దీనితో ఒక్కసారిగా లాస్ ఏంజెల్స్ హడలెతింది. అయితే మొత్తానికి ఆ మెరుపు గ్రహాంతరవాసులు సంబంధించినది కాదని, అది కోస్టల్ వన్డేన్బెర్గ్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి వచ్చిన రాకెట్ అని తెలిపారు స్పేస్ ఎక్స్ అధికారులు. అంతరిక్షంలోకి ఆఖరి బ్యాచ్ శాటిలైట్ ని తీసుకువెళ్తున్న రాకెట్ వెలుగులు చూసి జనం గ్రహాంతరవాసులని బ్రహ్మ పడ్డారని తెలిపారు. ఇలా రాకెట్ ను పంపడం మొదటి సారి ఏమి కాదని, జూన్ లో కూడా ఇలానే పంపించాం అని అన్నారు అధికారులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here