ఇప్పుడు హీరోలంతా చాలా ఫాస్ట్. ఓ సినిమా పూర్తి కాగానే మరో రెండు మూడు సినిమాలు లైన్ లో పెడుతున్నారు. ఎన్టీఆర్.. చరణ్.. ప్రభాస్.. మహేశ్.. ఇలా ఎవర్ని తీసుకున్నా కూడా ఇప్పుడు అంతా ఇదే దారిలో వెళ్తున్నారు. చివరికి చిరంజీవి లాంటి సీనియర్ హీరో కూడా ఓ సినిమా పూర్తి కాకముందే మరో రెండు సినిమాలు కన్ఫర్మ్ చేసాడు. కానీ అల్లుఅర్జున్ మాత్రం ఇప్పటికీ నెక్ట్స్ ఏంటో తేల్చుకోలేకపోతున్నాడు.
ఈ మధ్యే నా పేరు సూర్యతో వచ్చాడు. కానీ అది అంచనాలు అందుకోలేదు దాంతో తర్వాతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ఈ హీరో. పైగా ఈ చిత్రం ఏడేళ్ల వరకు అల్లుఅర్జున్ కు వచ్చిన డిజాస్టర్ ఇది. ఒకటి రెండు కాదు.. ఏకంగా 30 కోట్లకు పైగా నష్టాల్ని తీసుకొచ్చాడు సూర్య. దాంతో ఈ సారి ఏ ప్రయోగాలు లేకుండా పక్కా కమర్షియల్ కథ ఒకటి సిద్ధం చేయాల్సిందిగా తన దగ్గరికి వస్తున్న దర్శకులకు చెబుతున్నాడు బన్నీ.
ఇప్పటికే విక్రమ్ కే కుమార్ చెప్పిన కథ ఒకటి నచ్చిందని తెలుస్తుంది. దాంతోపాటు కొరటాల అన్నారు కానీ అది ఇప్పట్లో ఉండకపోవచ్చు. ఈ క్రమంలోనే ఇంకొంత కాలం బన్నీ వేచి చూసేలా కనిపిస్తున్నాడు కానీ ఇప్పట్లో మాత్రం తర్వాతి సినిమాపై క్లారిటీ ఇచ్చేలా మాత్రం లేడు. మరి చూడాలిక.. సూర్య ఇచ్చిన షాక్ నుంచి బన్నీ ఎప్పుడు బయటపడతాడో..?