బ‌న్నీ కోరిక‌ను ఆ ద‌ర్శ‌కుడు తీరుస్తాడా..?

ఒక్క ఫ్లాప్ తో బ‌న్నీలో ఇంత మార్పు వ‌స్తుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. దానికి ముందు ఒక‌టి రెండు మూడు అంటూ వ‌ర‌స‌గా సినిమాలు క‌మిట్ అయిన బ‌న్నీ.. ఒక్క ఫ్లాప్ తోనే భ‌య‌ప‌డిపోతున్నాడో.. లేదంటే ఇంకా ఎక్కువ జాగ్ర‌త్త ప‌డుతున్నాడో తెలియ‌దు కానీ పూర్తిగా జోరు త‌గ్గించేసాడు. నా పేరు సూర్య వ‌చ్చి మూడు నెల‌లు గ‌డిచినా ఇప్ప‌టికీ మ‌రో సినిమా అనౌన్స్ చేయ‌లేదు. ఇప్పుడు ప‌రుశురామ్ చెప్పిన క‌థ‌కు సై అనేసాడ‌ని తెఉల‌స్తుంది.
Allu-Arjun-next-Movie-with-Director-Parasuram
అయితే ఇప్పుడు ఈ చిత్రం ప‌ట్టాలెక్కాలంటే ముందు గీత‌గోవిందంతో ఈ ద‌ర్శ‌కుడు స‌క్సెస్ అవ్వాలి. మంచి క‌థ చెప్పినా న‌మ్మ‌కం కుద‌రాలంటే ముందు ట్ర‌య‌ల్ వేయాలి. ఇప్పుడు బ‌న్నీ ఇదే చేస్తున్నాడు. ప‌రుశురామ్ టాలెంట్ తెలిసినా కూడా గీత‌గోవిందం వ‌చ్చేవ‌ర‌కు ఎదురు చూపులు త‌ప్ప‌వు. ఆగ‌స్ట్ 15న విడుద‌ల కానుంది ఈ చిత్రం. ప‌రుశురామ్ తోనే మ‌రో సినిమా చేయ‌నున్న‌ట్లు అల్లు అర‌వింద్ కూడా ప్ర‌క‌టించాడు. అయితే అది బ‌న్నీతోనే అనేది చెప్ప‌లేదు. ప‌రుశురామ్ క‌థ‌తో పాటు మ‌రిన్ని క‌థ‌ల‌పై కూడా ఫోక‌స్ పెట్టాడు అల్లువార‌బ్బాయి. మ‌రి ఇందులో ఏది ఎప్పుడు ఫైన‌ల్ అవుతుందో తెలియ‌దు ఇంకా..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here