ఒక్క సినిమాతో ఇండస్ట్రీలో జాతకాలు మారిపోతుంటాయి. ఆ మారిపోయిన జాతకాన్ని జారిపోకుండా పట్టుకోవడమే ఇక్కడ కావాలి. ఇప్పుడు శాలినిపాండే ఇదే చేస్తుంది. అర్జున్ రెడ్డి సినిమా చూసిన వాళ్లకు ఈ భామ గురించి పరిచయం అక్కర్లేదు. బేబీ బేబీ అంటూ కుర్రాళ్ల గుండెలకు తూట్లు పెట్టింది ఈ భామ. ముద్దు ముద్దుమాటలతో అందాలు ఒలికించింది ఈ థియేటర్ ఆర్టిస్ట్. ముంబైలో థియేటర్ ఆర్ట్స్ చేసింది కాబట్టే తొలి సినిమాలోనే అంత బాగా పర్ఫార్మ్ చేసింది శాలిని. ఇప్పుడు ఈమె వరస ఆఫర్లతో దూసుకుపోతుంది. పై నుంచి అందాల ఆరబోతతోనూ పిచ్చెక్కి స్తుంది. తాజాగా ఈమెవి కొన్ని ఫోటోలు బయటికి వచ్చాయి. ఇందులో అమ్మాయిగారు ఫుల్ గా రెచ్చిపోయారు. పర్సనల్ ఫోటోస్ కావడంతో అడ్డు అదుపు లేకుండా అందాలు ఆరబోసింది అర్జున్ రెడ్డి పాప.
శాలిని ప్రస్తుతం తమిళనాట 100 పర్సెంట్ లవ్ సినిమా రీమేక్ లో ఈ భామే నటిస్తుంది. ఈ చిత్రంలో ముందు లావణ్య త్రిపాఠిని తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఆమెను తప్పించి షాలిని పాండేనే హీరోయిన్ గా తీసుకున్నారు దర్శక నిర్మాతలు. 100 పర్సెంట్ లవ్ రీమేక్ తో పాటు మహానటిలోనూ నటిస్తుంది షాలిని పాండే. సావిత్రి బయోపిక్ గా మహానటి సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు. కీర్తిసురేష్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. ఇందులో షాలిని పోషించే పాత్రేంటి..? ఎవరి కారెక్టర్ లో ఈమె కనిపించబోతుందనే విషయాలు మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ మధ్యే దుల్కర్ సల్మాన్ తో ఓ సినిమాలో నటించబోతుంది షాలిని పాండే. ఏఎస్ కార్తిక్ తెరకెక్కించబోయే ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ కి జోడీగా నటించబోతుంది ఈ బ్యూటీ. ఇక ఇప్పుడు శర్వానంద్ కు జోడీగా ఈ భామనే తీసుకున్నారు. సుధీర్ వర్మ దర్శకత్వంలో నటించబోతున్నాడు శర్వా. ఈ చిత్రంలో షాలిని పాండేను హీరోయిన్ గా తీసుకున్నారు. ఇందులో మెయిన్ హీరోయిన్ గా నివేదా థామస్ నటిస్తుంది. మొత్తానికి అర్జున్ రెడ్డి పాప మాత్రం ఇప్పుడు వరస అవకాశాలతో దూసుకుపోతుంది.