అస‌లు సాయిప‌ల్ల‌వి ప్లాన్ ఏంటి..? 

Sharwanand, Sai Pallavi For Hanu Raghavapudi Directorial Film In Sri Lakshmi Venkateswara Cinemas Banner
ఏ హీరోయిన్ అయినా స్టార్ హీరోల‌తో న‌టించాల‌ని కోరుకుంటుంది. కానీ సాయిప‌ల్ల‌వి మాత్రం చాలా తెలివిగా సినిమాలు ఒప్పుకుంటుంది. తాను న‌టించే సినిమాల్లో హీరోలు క‌చ్చితంగా న‌టులు అయి ఉండాల‌నే రూల్ ఏదో పెట్టుకున్న‌ట్లుంది ఈ భామ‌. లేదంటే ఆ సినిమా క‌థంతా త‌న‌పైనే న‌డ‌వాల‌ని కోరుకుంటుందేమో..? ఇప్ప‌టికే ఫిదాతో అదే చేసి చూపించింది సాయిప‌ల్లవి. ఈ చిత్రం అంత విజ‌యం ఎలా సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇక రెండో సినిమా ఎంసిఏలో నానితో క‌లిసి న‌టించింది సాయిప‌ల్ల‌వి. అక్క‌డ న్యాచుర‌ల్ స్టార్.. ఇక్క‌డ న్యాచుర‌ల్ బ్యూటీ విత్ యాక్టింగ్.. ఇద్ద‌రూ క‌లిసి మిడిల్ క్లాస్ అబ్బాయిని అప్ప‌ర్ క్లాస్ చేసేసారు.
ఇక ఇప్పుడు తెలుగులో మ‌రో సినిమా ఒప్పుకుంది సాయిప‌ల్ల‌వి. ఈ సారి శ‌ర్వానంద్ కు జోడీగా న‌టించ‌బోతుంది సాయిప‌ల్ల‌వి. టాలీవుడ్ లో ఇప్పుడున్న కుర్ర హీరోల్లో అద్భుత‌మైన న‌టులు అనే పేరున్న‌ది నాని.. శ‌ర్వానంద్ కు మాత్ర‌మే. నానితో న‌టించింది.. ఇప్పుడు శ‌ర్వాతో జోడీ క‌ట్ట‌బోతుంది. స్టార్ ప‌వ‌ర్ ను ద‌గ్గ‌రికి కూడా రానివ్వ‌ట్లేదు ప‌ల్ల‌వి. స్టార్ హీరోలు ఆఫ‌ర్లు ఇచ్చినా సున్నితంగా తిర‌స్క‌రిస్తుంది. త‌మిళ‌నాట అయితే ఓకే కానీ తెలుగులో మాత్రం ఓన్లీ మీడియం రేంజ్ హీరోలే అంటుంది ఈ భామ‌. హ‌ను రాఘ‌వ‌పూడి తెర‌కెక్కిస్తున్న సినిమాలో సాయిప‌ల్ల‌వి హీరోయిన్ గా ఎంపికైంది. జ‌న‌వ‌రి చివ‌రి వారంలో ఈ చిత్రం ప‌ట్టాలెక్క‌నుంది. మొత్తానికి సాయిప‌ల్ల‌వి ఏదో గ‌ట్టి ప్లాన్ తోనే రంగంలోకి దిగిన‌ట్లు క‌నిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here