ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాపు రిజర్వేషన్ ప్రవేశపెట్టడంపై భిన్న స్వరాలు

Kapu-reservation-bill-introduced-by-Andhra-Pradesh-Government1
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కాపు రిజర్వేషన్ బిల్ ను రాష్ట్ర అసెంబ్లీ లో ప్రవేశపెట్టింది. కాపులకు విద్య మరియు ఉద్యోగ అవకాశాలతో 5 % రిజర్వేషన్ ప్రకటించింది ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదంతో అసెంబ్లీలో బిల్ ను ప్రవేశపెట్టారు. గత కొంత కలం గా కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం కాపు లను బీసీ లో చేర్చవలసిందిగా ఉద్యమాన్ని చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమం లో అయన ప్రభుత్వానికి అంబెడ్కర్ వర్ధంతి అయిన డిసెంబర్ 6 ను డెడ్లైన్ గా విధించారు కూడా. ఈ లోపే ప్రభుత్వం కాపు రిజర్వేషన్ బిల్ ను ప్రవేశ పెట్టడం గమనార్హం.
ఇప్పటివరకు బీసీ లకు 29%, షెడ్యూల్ క్యాస్ట్ వారికీ 15 % మరియు షెడ్యూల్ ట్రైబ్స్ కు 6% రిజర్వేషన్ ఉండగా కాపులకు 5 % ఇవ్వడం తో మొత్తం రిజర్వేషన్ కోటా 50 % కు చేరింది. ఈ విషయం పై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షానికి చెక్ పెట్టడానికే కాపు రిజర్వేషన్ బిల్ ను ప్రవేశపెట్టారని కొందరు, ఇది కేవలం కాపులకు కంటి చూపు చర్యగానే ఉందని మరికొందరు అంటున్నారు. మరో వైపు జగన్ తన పాదయాత్రలో కాపులను రిజర్వేషన్ పేరుతో రెచ్చగొడుతున్నారని, ఆయన వ్యూహాన్ని నీరుగార్చే పనిగా కాపు బిల్ ప్రవేశపెట్టారని మరి కొందరి వాదన.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here