ఇండియా టాప్ డిజైనర్ సబ్యసాచి ముఖేర్జీ యూత్ పైన కామెంట్లు వేశారు. హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్ లో సబ్యసాచి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ సమయంలో ఓ విద్యార్థిని శారీ కట్టుకోవడంలో ఇబ్బందులను గురించి ప్రశ్నించింది. దీనికి సమాధానంగా సభ్యసాచి శారీ కట్టుకోవడం తెలియదంటే మహిళలు సిగ్గుపడాలన్నారు. ముఖ్యంగా యంగర్ జనరేషన్‌ను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మన సంప్రదాయాన్ని మనం మర్చిపోతున్నాము అని అన్నారు. ఈ వ్యాఖ్యలకి యూత్ చపటాలతో వాళ్ల స్పందన తెలిపారు.