ఆర్ఆర్ఆర్.. ఇప్పుడు ఈ పేరు వింటే రాజమౌళి గుర్తొస్తాడు. రామ్ చరణ్.. రామారావు.. రాజమౌళి అంటూ మూడు ఆర్ లను విడుదల చేసాడు ఈ దర్శకుడు. ఇప్పుడు ఈ చిత్రంలో ఇంకో ఆర్ కూడా చేరబోతుందని తెలుస్తుంది. ఆ ఆర్ పేరు రాజశేఖర్. అవును.. ఈ చిత్రంలో విలన్ గా రాజశేఖర్ నటిస్తున్నాడనే ప్రచారం జరుగుతుంది. దీనికి నిదర్శనంగా ఈ మధ్యే రాజశేఖర్ కూతురు శివానీ సినిమా 2 స్టేట్స్ రీమేక్ ఓపెనింగ్ కు వచ్చాడు దర్శకధీరుడు. నిజానికి ఈ చిత్రంతో రాజమౌళికి ఎలాంటి సంబంధం లేదు. కేవలం రాజశేఖర్ కోరిక మేరకు వచ్చాడని తెలుస్తుంది. దానికి తోడు రాజమౌళి సినిమాలో రాజశేఖర్ విలన్ గా నటించడానికి ఓకే చెప్పాడని తెలుస్తుంది. అసలు రాజశేఖర్ అనే హీరో ఉన్నాడనే విషయాన్ని ఈ మధ్యే గరుడవేగ సినిమా గుర్తు చేసింది. ఈ చిత్రం కమర్షియల్ గా సక్సెస్ కాలేదు కానీ ప్రశంసలతో పాటు రాజశేఖర్ ఈజ్ బ్యాక్ అనిపించింది. ఇకిప్పుడు ఈ చిత్రం ఇచ్చిన ఉత్సాహంలో కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు ఈ హీరో.
నెక్ట్స్ సినిమాలపై కీలకమైన విషయాలు చెప్పాడు రాజశేఖర్. ఎక్కడ మొదలుపెట్టావో అక్కడికి వచ్చి ఆగుతున్నాడు ఈ హీరో. కొన్నేళ్లుగా సరైన ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న ఈ హీరో ఇప్పుడు విలన్ గా మారనున్నాడు. తనకి నచ్చే కథ రావాలే కానీ ఇప్పుడే విలన్ గా నటిస్తానంటూ ఆఫర్ ఇచ్చాడు రాజశేఖర్. ఇప్పుడు రాజమౌళి లాంటి దర్శకుడు ఆఫర్ ఇస్తే ఎందుకు నో అంటాడు చెప్పండి..? ఇప్పుడు ఇదే జరుగుతుందని తెలుస్తుంది. ఇప్పటికే రాజశేఖర్ జమానాలోని వినోద్ కుమార్, సుమన్, రాజేంద్ర ప్రసాద్, జగపతిబాబు లాంటి హీరోలు కారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోయారు. ఇప్పుడు రాజశేఖర్ ఇదే దారిలో వెళ్తున్నాడు. ఇక కెరీర్ లో చెప్పుకోడానికి ఏం లేదని ఆయనకు కూడా సీన్ అర్థమైపోయింది. అందుకే విలన్ గా నటించడానికి ఓకే చెప్పాడు రాజశేఖర్.
కెరీర్ మొదట్లో తలంబ్రాలు లాంటి సినిమాల్లో రాజశేఖర్ నెగిటివ్ రోల్స్ చేసాడు. ఆ తర్వాత హీరోగా మారాడు. మళ్లీ ఇప్పుడు రాజశేఖర్ ప్రతినాయక పాత్రలపై మోజు పడుతున్నాడు. ఆ మధ్య చిరంజీవి 150వ సినిమాలో విలన్ గా నటిస్తానని చెప్పిన రాజశేఖర్.. ఆ తర్వాత ధృవలో నటించడానికి ట్రై చేసాడు. కానీ అనుకోని కారణాలతో అరవింద్ స్వామినే రిపీట్ చేయాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు ఈయన విలన్ అవతారం ఎత్తడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి చూడాలిక.. రాజమౌళి సినిమా కానీ వర్కవుట్ అయితే రాజశేఖర్ దశ మారిపోయినట్లే..? మరి చూడాలిక.. ఏం జరుగుతుందో..?