వదిలేయడం గొప్పా.. పట్టుకోవడం గొప్పా..! ఈ ప్రశ్న చాలా సార్లు చాలా మందికి వస్తుంది. కానీ అప్పటి పరిస్థితులను బట్టి వదిలేయడం కూడా ఒక్కోసారి గొప్పే. ఇప్పుడు ఆర్ఎక్స్ 100 విషయంలో ఇదే జరుగుతుంది. ఈ సినిమా ఇప్పుడు సంచలనం విజయం సాధించి బ్లాక్ బస్టర్ కా బాప్ అనిపించుకుంది.
తెలుగు రాష్ట్రాల్లోనే 10 కోట్ల షేర్ వైపు పరుగులు తీస్తుంది. కొత్త దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ చిత్రంతో కార్తికేయ హీరోగా నటించాడు. అయితే ఈ చిత్రంలో ముందు విజయ్ దేవరకొండను అనుకున్నాడు దర్శకుడు. మూడేళ్ల కింద పెళ్లి చూపులు కూడా రాని సమయంలో.. ఎవడే సుబ్రమణ్యం మాత్రమే విడుదలైన టైమ్ లో వెళ్లి ఈ కథ విజయ్ కు చెబితే పెళ్లిచూపులు చేస్తున్నాను..
ఇప్పుడు అంత హార్డ్ హిట్టింగ్ కథ చేయలేనని చెప్పాడు. ఇక ఆ తర్వాత సుధీర్ బాబు దగ్గరికి నాలుగు నెలలు తిరిగినా కూడా చివరికి ఇలాంటి కథలో తాను నటించ లేను అని వదిలేసుకున్నాడు. ఆ తర్వాతే అది కార్తిక్ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఈ చిత్ర విజయం చూసి వాళ్లు బాధ పడాల్సిన పనిలేదు. ఎందుకంటే అప్పుడు విజయ్ ఆర్ఎక్స్ 100 వదిలేసాడు కాబట్టే అర్జున్ రెడ్డి లాంటి పాత్ బ్రేకింగ్ సినిమా వచ్చింది.. సుధీర్ కు సమ్మోహనం లాంటి సాఫ్ట్ ఇమేజ్ ఉన్న సినిమా వచ్చింది. అన్నిసార్లు పట్టుకోవడమే కాదు.. కొన్నిసార్లు వదిలేయడం కూడా మంచిదే.