రామ్ చరణ్ సినిమా అంటే 60 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంతా ఫిక్స్ అయిపోయారు. మగధీర తర్వాత ఆ స్థాయి సక్సెస్ కోసం ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నాడు చరణ్. మధ్యలో ఎన్ని హిట్లు వచ్చినా మగధీరను మాత్రం క్రాస్ చేయలేకపోయాయి. మిగిలిన హీరోలంతా 50 కోట్లను నీళ్లు తాగినట్లు తాగేస్తుంటే.. మగధీర తర్వాత మరో 50 కోట్ల సినిమా అందుకోడానికి చరణ్ కు ఏడేళ్లు పట్టింది. ఇప్పుడు ఈయన రంగస్థలం సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తైపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉంది రంగస్థలం. ఈ చిత్ర రేంజ్ బాగానే ఉందిప్పుడు. ఈ చిత్రాన్ని దాదాపు 70 కోట్ల మేర బిజినెస్ చేస్తున్నారు. కానీ ఊహించిన రేంజ్ లో ఈ సినిమాకు బిజినెస్ కావడం లేదనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట.
ఒకప్పుడు మాస్ సినిమాలు తప్ప మరో జోనర్ ట్రై చేయని చరణ్ ఇప్పుడు తనను తాను నటుడిగా నిరూపించుకునే పనిలో బిజీగా ఉన్నాడు. చిరంజీవి తనయుడు అనే ముద్ర కంటే రామ్ చరణ్ అంటూ తనను తాను సొంతంగా ముద్ర వేయించుకోడానికి అడుగులేస్తున్నాడు మెగా వారసుడు. ఈ ప్రయత్నంలో ఇప్పటికే ధృవ తొలి అడుగు సక్సెస్ ఫుల్ గా వేసాడు. ఇక ఇప్పుడు రంగస్థలం సినిమాతో మరో మెట్టు ఎక్కడానికి చూస్తున్నాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 70 కోట్ల మేర జరుగుతుందని అంచనా. అయితే బయ్యర్లు మాత్రం రంగస్థలం రేంజ్ చూసి భయపడుతు న్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు మగధీర మినహా రామ్ చరణ్ సినిమా మరోటి 50 కోట్లు కూడా సరిగ్గా దాటలేదు. మరోవైపు సుకుమార్ కు కూడా ఈ మధ్య కాలంలో బ్లాక్ బస్టర్ లేదు.
ఇలాంటి టైమ్ లో వీళ్లను నమ్మి రంగస్థలం 70 కోట్ల బిజినెస్ చేస్తే ఏదైనా తేడా కొడితే ఏంటి పరిస్థితి అనుకుంటున్నారు. ఒక్క నైజాంలోనే ఈ చిత్ర రైట్స్ ఏకంగా 18.50 కోట్లకు అమ్ముడైపోయాయి. ఇది రామ్ చరణ్ కెరీర్ లోనే హైయ్యస్ట్ రేట్. ఇక ఓవర్సీస్ లోనూ భారీగానే కొంటున్నారు. ఒక్క ధృవ మినహా మరే సినిమా మిలియన్ మార్క్ అందుకోలేదు చరణ్ ఖాతాలో. ఇవన్నీ ఇలా ఉంటే ఈ చిత్ర బడ్జెట్ కూడా 70 కోట్ల పైనే పెట్టించాడు సుకుమార్. చెప్పిన టైమ్ కంటే ఆర్నెళ్లు ఎక్కువగా సమయం తీసుకున్నాడు. దాంతో నిర్మాతలకు కూడా మరో ఆప్షన్ లేకుండా పోతుంది.. అందుకే భారీ రేట్లకు అమ్ముతున్నారు. 30 ఏళ్ల కింద రంగస్థలం అనే ఊళ్లో ఓ కుర్రాడికి జరిగిన అన్యాయం ఏంటి.. దానికి అతడు తీర్చుకున్న బదులు ఏంటి అనేది రంగస్థలం కథ.
80వ దశకంలో ఫేమస్ అయిన పీచు మిఠాయి.. గోలీసోడా.. గోల్డ్ స్పాట్ కూల్ డ్రింక్.. అప్పట్లో ఉండే షాపులు.. జాతర.. అక్కడ రంగులరాట్నం.. ఇవన్నీ ఫోటోలో దర్శనమిస్తున్నాయి. ఈ సెట్ లో ఉన్న చాలా వస్తువులను పోలవరం ముంపు ప్రాంతాల్లోని గ్రామాల్లోంచి కొన్నారు. అందుకే చాలా న్యాచురల్ గా రంగస్థలం సిద్ధమవుతుంది. ఈ చిత్ర ఫలితంపై కావాల్సినంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు మెగా వారసుడు. రంగస్థలంతో తాను బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమంటున్నాడు. మార్చ్ 30, 2018లో సినిమా విడుదల కానుంది ఈ చిత్రం. చరణ్ ఎంత నమ్మకంగా ఉన్నా బయ్యర్లలో మాత్రం ఆ భయం కనిపిస్తూనే ఉంది. మరి రేపు విడుదలైన తర్వాత మొత్తానికి తన సినిమాతో ప్రేక్షకులను మాయ చేయాలని ఫిక్సైపోయాడు సుకుమార్.