స‌మంత రెచ్చిపోయింది.. నాగార్జున‌కు కోప‌మొచ్చింది.

ఇప్పుడు ఇదే వార్త‌లు వినిపిస్తున్నాయి ఇండ‌స్ట్రీలో. అక్కినేని కోడ‌లు ముందు వెన‌క చూసుకోకుండా అలా రెచ్చిపోవ‌డం ఎవ‌రికీ న‌చ్చ‌డం లేద‌ని తెలుస్తుంది. ఎందుకో తెలియ‌దు కానీ స‌డ‌న్ గా రూట్ మార్చింది స‌మంత‌. ఉన్న‌ట్లుండి క్లీవేజ్ షో చేసి అంద‌రి మ‌తులు చెడ‌గొట్టింది. అప్ప‌టి వ‌ర‌కు బాగానే ఉన్న స‌మంత‌.. అప్ప‌టిక‌ప్పుడు మ‌న‌సు మార్చుకుని అందాల‌న్నీ ఆర‌బోసింది. ఏకంగా బికినీలా ఉండే క్యాస్ట్యూమ్ లో రెచ్చిపోయేస‌రికి ఇప్పుడు అక్కినేని కోడలిపై కాస్త అస‌హ‌నంగానే ఉన్నాడు నాగార్జున అనే ప్ర‌చారం జ‌రుగుతుంది. కోడ‌లిని అలా చూసి నాగార్జున‌కు కూడా కోపం క‌ట్ట‌లు తెంచుకుందంటున్నారు.

పెళ్లి త‌ర్వాత స‌మంత ప‌ద్ద‌తిగా ఉంటుందేమో అనుకుంటే.. ఇప్ప‌టికీ అదే దూకుడు చూపిస్తుండ‌టంతో షాక్ త‌ప్ప‌డం లేదు. అయితే దీనిపై స‌మంత మాత్రం ఎవ‌రి మాటా వినడం లేదు. త‌న‌కు ఎలా ఉండాల‌నిపిస్తే అలా ఉంటానంటుంది. భ‌ర్త నాగ‌చైత‌న్య నుంచి ఫుల్ ప‌ర్మిష‌న్స్ రావ‌డంతో ఇప్పుడు రెచ్చిపోతుంది అక్కినేని కోడ‌లు. దాంతో ఎవ‌రేం అనుకున్నా కూడా స‌మంత దారిలో స‌మంత వెళ్తుంది. మ‌రి ఈ దూకుడు ఇంకా ఎంత‌దూరం వెళ్తుందో చూడాలి. ప్ర‌స్తుతానికి తెలుగులో స్టార్ హీరోలెవ‌రూ స‌మంత‌తో న‌టించ‌డానికి ఒప్పుకోవ‌డం లేదు. కానీ ఈ తెగింపు చూసిన త‌ర్వాత మ‌ళ్లీ క్యూ క‌డ‌తారేమో అనిపిస్తుంది. ప్ర‌స్తుతం శ‌ర్వానంద్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో 96 రీమేక్ లో న‌టించ‌డానికి ఒప్పుకుంది స‌మంత‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here