ఈ న‌గ‌రానికి ఏమైంది త‌రుణ్..?


త‌రుణ్ అంటే ఇక్క‌డ పాత హీరో త‌రుణ్ కాదు..! అస‌లే ఆ మ‌ధ్య డ్ర‌గ్స్ కేసులో మ‌నోడి పేరు ఎక్కువ‌గా వినిపించింది క‌దా..! మ‌ళ్లీ అదే త‌రుణ్ అనే ఊహ‌ల్లో ఉంటే క‌ష్టం. ఇక్క‌డ త‌రుణ్ అంటే ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్. పెళ్లి చూపులుతో ఈయ‌న ఒక్క‌సారిగా అంద‌రి దృష్టిలో ప‌డ్డాడు.
కానీ రెండో సినిమా కోసం ఇప్ప‌టి వ‌ర‌కు వెయిట్ చేయిస్తూనే ఉన్నాడు ప్రేక్ష‌కుల్ని. ఇప్పుడు ఈ న‌గ‌రానికి ఏమైంది అంటూ వ‌స్తున్నాడు. ఈయ‌న రెండో చిత్రం టైటిల్ విడుద‌లైంది. అంతా కొత్త వాళ్ళ‌తో ఈయ‌న చేస్తోన్న సినిమాకు ఈ న‌గ‌రానికి ఏమైంది అంటూ టైటిల్ పెట్టాడు త‌రుణ్. తాజాగా ఫ‌స్ట్ లుక్ కూడా విడుద‌లైంది.
సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇదే ఏడాది సినిమా విడుద‌ల కానుంది. ఇది కూడా పూర్తిగా కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ అని తెలుస్తుంది. కాక‌పోతే కాస్త థ్రిల్లింగ్ అంశాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా దొంగ‌త‌నం బ్యాక్ డ్రాప్ లో సినిమా వ‌స్తుంది. హాలీవుడ్ క్రైమ్ కామెడీ త‌ర‌హాలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు త‌రుణ్ భాస్క‌ర్. ఈ చిత్రంతో పాటు మ‌రో రెండు సినిమాల‌కు కూడా క‌మిట‌య్యాడు త‌రుణ్. అయితే అన్ని సినిమాలు మ్యాగ్జిమ‌మ్ కొత్త వాళ్ల‌తో చేయ‌డానికే ఆలోచిస్తున్నాడు ఈ కుర్రాడు. మ‌రి చూడాలిక‌.. ఈ న‌గ‌రానికి ఏమైంది అంటూ ఏం చేస్తాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here