ఏప్రిల్ 17 నుండి రెండ షెడ్యూల్ లో "నివాసి"


శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట లాంటి మంచి చిత్రంలో న‌టించి అంద‌రి హ్రుద‌యాల్లో న‌టుడిగా మంచి స్థానం సంపాయించిన శేఖ‌ర్ వ‌ర్మ హీరోగా, వివియా, విద్య లు హీరోయిన్స్‌గా , స‌తీష్ రేగ‌ళ్ళ ని ద‌ర్శ‌కుడు గా ప‌రిచ‌యం చేస్తూ గాయ‌త్రి ప్రోడ‌క్ష‌న్స్ మ‌రియు ద‌త్తాత్రేయా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌ లో కె.ఎన్‌.రావు, టి.వి.వి.ఎస్‌.ఎన్. వ‌ర్మ లు నిర్మాత‌లు గా సంయుక్త‌గా నిర్మిస్తున్నారు.
ఇప్ప‌టికే 75% షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్నారు. ఏప్రిల్ 17 నుండి రెండ షెడ్యూల్ ని ప్రారంభిస్తారు. ఇది ఒక ఫ్యామిలి యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కుతుంది. ట్రావెల్ బేస్డ్ స్టోరి. చ‌ర‌ణ్-అర్జున్ సంగీత ద‌ర్శ‌కులు. రెండు పాట‌లు, క్లైమాక్స్ మిన‌హ మెత్తం చిత్రం పూర్త‌యింది. త్వ‌ర‌లో పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు కూడా ప్రారంభిస్తారు.
ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు స‌తీష్ రేగ‌ళ్ళ మాట్లాడుతూ.. శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట సినిమా చూశాను. ఆ సినిమా లో శేఖ‌ర్ వ‌ర్మ చాలా ఎమెష‌న్ గా వుండే పాత్ర‌, అదీ కాకుండా చాలా చ‌క్క‌గా న‌టించి అంద‌ర్ని మెప్పించాడు. ఆ త‌రువాత నంద‌మూరి బాల‌కృష్ణ గారు న‌టించిన జ‌య‌సింహ చిత్రంలో చాలా చ‌క్క‌టి పాత్ర‌లో న‌టించి మెప్పించారు.
న‌టుడుగా చాలా మంచి మార్కులు వేసుకున్న శేఖ‌ర్ ని దృష్టిలో పెట్టుకుని ఈ క‌థ రాశాను. చాలా చ‌క్క‌టి ఎంట‌ర్‌టైన‌ర్ గా చేస్తున్నాము. అంతేకాదు మంచి ఫ్యామిలి ఎమెష‌న్ తో కూడిన థ్రిల్ కూడా ప్రేక్ష‌కులు ఫీలయ్యేలా క‌థ‌నం వుంటుంది. నిర్మాత‌లు కె.ఎన్‌.రావు గారు, వ‌ర్మ గారు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా చిత్రాన్ని తెర‌కెక్కించ‌డంలో స‌హ‌యాన్ని అందిస్తున్నారు. 75% ఇప్పటికే చిత్ర షూటింగ్ పూర్త‌యింది. క్లైమాక్స్ , 2 పాట‌లు మిన‌హ సినిమా పూర్త‌యింది. ఏప్రిల్ 17 నుండి రెండవ షెడ్యూల్ ని స్టార్ట్ చేస్తున్నాము. ఇటీవ‌ల మోము విడుద‌ల చేసిన మెద‌టి లుక్ కి చాలా మంచి రెస్పాన్స్ రావ‌టం మాకు చాలా ఆనందాన్నిచ్చింది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి త్వ‌ర‌లో విడుద‌లకి స‌న్నాహ‌లు చేస్తున్నాము. అని అన్నారు.
బ్యాన‌ర్స్‌… గాయ‌త్రి ప్రోడ‌క్ష‌న్స్ అండ్ ద‌త్తాత్రేయా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
న‌టీన‌టులు.. శేఖ‌ర్ వ‌ర్మ‌, వివియా, విద్య‌, సుద‌ర్శ‌న్‌, జె.పి(త‌మిళ్‌), కొటేశ్వ‌రావు త‌ద‌త‌రులు న‌టించగా..
కొరియోగ్ర‌ఫి– భాను మాస్ట‌ర్‌, ప్ర‌సాద్ మాస్ట‌ర్‌
మ్యూజిక్‌- చ‌ర‌ణ్‌-అర్జున్‌
సినిమాటోగ్ర‌ఫి– కె.చిట్టిబాబు
ఆర్ట్‌– ముర‌ళి వీర‌వ‌ల్లి
పి.ఆర్‌.ఓ– ఏలూరు శ్రీను
ఎడిటింగ్‌– ప్ర‌తాప్
స్టంట్స్‌– ష‌యెలిల్ మ‌ల్లేష్
నిర్మాత‌లు– కె.ఎన్‌.రావు, టి.వి.వి.ఎస్‌.ఎన్ వ‌ర్మ‌
ద‌ర్శ‌క‌త్వం– స‌తీష్ రేగ‌ళ్ళ‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here