మన దగ్గరే ఏడాదికి కనీసం ఒక్కటైనా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ వస్తుంది. అందులో ఎమోషన్స్ ను మిక్సీలో వేసి ఫుల్లుగా రంగరించి కుటుంబ కథలకు ప్రాణం పోస్తుంటారు మన దర్శకులు. ఇప్పుడు మన సినిమాలు సరిపోవన్నట్లు పక్క రాష్ట్రం నుంచి ఇవే బంధాలతో వచ్చాడు చినబాబు. కార్తి హీరోగా వచ్చిన ఈ చిత్రం తెలుగులో వర్కవుట్ కాలేదు. మన దగ్గరే బోలెడు అనుబంధాలు ఉన్నాయి. దాంతో అరవ అనుబంధాలను పెద్దగా పట్టించుకోలేదు మన ఆడియన్స్. చినబాబు తెలుగులో 3.2 కోట్లు షేర్ తీసుకొచ్చింది.
కానీ ఇది సేఫ్ కావాలంటే 6.5 కోట్లు రావాలి. ఇప్పటికే రన్ పూర్తి కావడంతో కార్తికి చినబాబు ఫ్లాప్ గానే మిగిలిపోయింది. పాండిరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సూర్య నిర్మించాడు. 90ల్లో చూసే ముద్దుల మావయ్య కథతో పాటు 80ల్లో వచ్చిన అక్కా తమ్ముడు సెంటిమెంట్ కూడా చూపించాడు. కొన్నిచోట్ల ఓవర్ అనిపించినా చినబాబు మాత్రం మ్యాగ్జిమమ్ మేనేజ్ చేసాడు. పాండిరాజ్ స్క్రీన్ ప్లేతో సినిమా గట్టెక్కింది. కామెడీ కూడా అద్భుతంగా వర్కవుట్ అయినా కూడా తెలుగులో ఇది పండలేదు. తమిళ్ లో మాత్రం చినబాబు సూపర్ హిట్ అయింది. అక్కడ కడైకుట్టి సింగంగా వచ్చి దుమ్ము రేపింది ఈ చిత్రం. తెలుగులో 2019లో స్ట్రెయిట్ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు కార్తి.