తెలుగు టీవీ సమర్పణలో శరత్ శ్రీరంగం, కారుణ్య జంటగా నటిస్తున్న చిత్రం సీత..రాముని కోసం. అనిల్ గోపిరెడ్డి సంగీత మరియు దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Konidala Niharika Launches the Audio of "Seetha Ramuni Kosam
ఈ మూవీ ఆడియోని ఈ ఉదయం మెగా ఫామిలీ వారసురాలు నిహారిక చేతులమీదుగా విడుదల చేసారు. సీత రాముని కోసం పాటలు చాలా బావున్నాయని, చిత్రం ట్రైలర్ ఇంట్రస్టింగ్ గా వుందని..మూవీ తప్పకుండ చూస్తానని నిహారిక చెప్పారు. ఈ చిత్రం విజయవంతం కావాలని నిహారిక అభినందనలు తెలియచేసారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ నా రెండో సినిమా చిరంజీవి గారి చేతుల మీదుగా ప్రారంభమైంది. ఇప్పుడు ఈ చిత్రం ఆడియో మెగా వారసురాలి చేతుల మీదుగా రిలీజ్ కావడం ఆనందంగా ఉందని అన్నారు. తన మొదటి సినిమా ఆడియో నిహారిక లాంచ్ చేయడం సంతోషంగా ఉందని చిత్ర హీరో శరత్ శ్రీరంగం చెప్పారు. ఈ సీత రాముని కోసం చిత్రానికి మాటలు-వేణు రాచర్ల , ఎడిటింగ్- సాయి తలారి , కెమెరామెన్ – జయపాల్ రెడ్డి , రచన ,సంగీతం,దర్శకత్వం – అనిల్ గోపిరెడ్డి. సెన్సార్ కార్య    క్రమాలు పూర్తిచేసుకుని ఈ నెల్లోనే ఈ చిత్రం విడుదలకి సిద్దమవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here