ఇండస్ట్రీలో పోటీ వాతావరణం పెరిగిపోయింది. ఒకేరోజు వచ్చినా పర్లేదు తమ సినిమాలు కూడా రావాల్సిందే అనే పట్టు ఎక్కువైపోయింది. గతంలో ఇదే జరిగింది. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. లేకపోతే మరేంటి.. ఒకేరోజు మూడు నాలుగు సినిమాలు వస్తున్నపుడు కచ్చితంగా నష్టపోతారనే కనీస జ్ఞానం కూడా నిర్మాతలకు ఉండదా..? ఉంటుంది కానీ ఏం అవుతుందిలే అనే మొండి ధైర్యం ఒకటి వచ్చేసింది ఇప్పుడు అందర్లోనూ. ఫిబ్రవరి 9న ఇండస్ట్రీలో చిన్నసైజ్ యుద్ధమే జరగబోతుంది. ఆ రోజు ఏకంగా ఐదు సినిమాలు రానున్నాయి. ఇక ఇందులో మెగా హీరోలే ఇద్దరుండటం విశేషం.
ఫిబ్రవరి 9న వరుణ్ తేజ్ తొలిప్రేమ విడుదల కానుందని అనౌన్స్ చేసారు దర్శక నిర్మాతలు. ఈ విడుదల తేదీనికి మూడు నెలల కిందే ప్రకటించాడు నిర్మాత. వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ చిత్రంలో రాశీఖన్నా హీరోయిన్. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. ఇప్పటికే విడుదలైన పాటలకు.. టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇది కచ్చితంగా అప్పుడు పవన్ కెరీర్ కు ఎలాగైతే తొలిప్రేమ మైల్ స్టోన్ అయిందో.. ఇప్పుడు వరుణ్ కెరీర్ కు అవుతుందని అంచనాలు వేస్తున్నారు దర్శక నిర్మాతలు.
ఇక ఇదే ఫిబ్రవరి 9న తేదీన సాయిధరంతేజ్-వినాయక్ సినిమా కూడా రానుంది. ఇంటలిజెంట్ అనే టైటిల్ ఈ చిత్రానికి ఫిక్స్ చేస్తూ తాజాగా ప్రకటన కూడా ఇచ్చారు దర్శక నిర్మాతలు. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఆకుల శివ కథ అందించిన ఈ చిత్రానికి వినాయక్ దర్శకుడు కావడంతో అంచనాలు పెరిగిపోయాయి. పైగా ఖైదీ నెం.150 లాంటి సినిమా తర్వాత వస్తోన్న సినిమా కావడంతో సాధారణంగానే అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ ఇద్దరు మెగా హీరోలు ఒకేరోజు రానుండటం నిర్మాతలకు కూడా ఇబ్బందే. అయితే సాయి పూర్తి మాస్ సినిమాతో వస్తుంటే.. వరుణ్ మాత్రం పూర్తిగా లవ్ స్టోరీతో వస్తున్నాడు. మరి ఈ రెండు సినిమాల క్లాష్ బాక్సాఫీస్ దగ్గర ఎలా ఉండబోతుందో..?