అదేంటి.. తొలిప్రేమ రీమేక్ ఫిదా ఎలా అవుతుంది..? ఇది వేరు.. అది వేరు. పైగా రెండు సినిమాల్లో హీరో వరుణ్ తేజ్ కదా.. అలా ఎలా సాధ్యం రీమేక్ చేయడం అనుకుంటున్నారా..? ఇది సినిమా ఇండస్ట్రీ.. ఏది ఎప్పుడు ఎలాగైనా సాధ్యమవుతుంది. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది.
మన సినిమాలు ఇతర భాషల్లోకి రీమేక్ అవుతుండటం ఎప్పట్నుంచో జరుగుతుంది. అయితే ఒక్క ఇండస్ట్రీ మాత్రం మన సినిమాలు ఇలా వచ్చి రాగానే వెంటనే తమ భాషలోకి రీమేక్ చేస్తుంటారు. అదే బెంగాలి.. నెలల గ్యాప్ లోనే మన సినిమాను తీసుకెళ్లి బెంగాలీలో రీమేక్ చేస్తుంటారు. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో తొలిప్రేమ మంచి విజయం సాధించింది. వరుణ్ తేజ్ కు వరసగా రెండో విజయం తీసుకొచ్చిన సినిమా ఇది.
ఈ చిత్రాన్ని ఇప్పుడు బెంగాలిలో రీమేక్ చేసారు. దాని టైటిల్ ఏంటో తెలుసా.. ఫిదా. అవును.. మన తొలిప్రేమ వాళ్లకు ఫిదా అయిపోయింది. అక్కడి కుర్ర హీరో యశ్ దాస్ గుప్తా, సంజన ఈ చిత్రంలో నటిస్తున్నారు. జులై 13న విడుదల కానుంది ఈ చిత్రం. ఈ హీరోనే గతంలో నేను లోకల్.. తని ఒరువన్ సినిమాలను కూడా రీమేక్ చేసాడు. ఇప్పుడు తొలిప్రేమతో వస్తున్నాడు. ఈ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగానే ట్రెండ్ అవుతుంది.