ధుర్యోధ‌నుడిగా బాల‌య్య భేష్.. 

పౌరాణిక పాత్ర‌లు చేయాలంటే తెలుగులో ఎన్టీఆర్ త‌ర్వాతే ఎవ‌రైనా..! ఇంకా మాట్లాడితే ఆ కుటుంబంలో వాళ్ల త‌ర్వాతే ఎవ‌రైనా..! ఎందుకంటే అన్న గారి త‌ర్వాత ఆ పాత్ర‌ల్ని అంత‌గా ర‌క్తి క‌ట్టించిన హీరో మ‌రొక‌రు లేరు. కానీ తండ్రి చేసిన పాత్ర‌ల‌ను తాను కూడా చేస్తూ అభిమానుల‌తో ఔరా అనిపిం చాడు బాల‌య్య‌. శ్రీ‌రామ‌రాజ్యం కానీ.. పాండురంగ‌డు కానీ బాల‌య్య కూడా బాగా చేసాడు. ఆయ‌న కూడా పౌరాణిక పాత్ర‌ల్లో ఒదిగిపోయాడు. ఇక ఇప్పుడు ఈయ‌న ధుర్యోధ‌నుడిగా మారిపోయాడు. ఎన్టీఆర్ బ‌యోపిక్ ఓపెనింగ్ లో అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూ ధుర్యోధ‌నుడిగా ఎంట్రీ ఇచ్చాడు బాల కృష్ణ‌. రామ‌కృష్ణ స్టూడియోస్ లో ఈ సీన్ కోసం పెద్ద సెట్ వేసారు. దాన‌వీర‌శూర‌క‌ర్ణ సినిమాలోని ఏమంటివి ఏమంటివి డైలాగ్ తోనే ఎన్టీఆర్ బ‌యోపిక్ మొద‌లైంది. అచ్చంగా అన్న‌గారిని గుర్తుచేసే ఆ రూపం చూసి అభిమానులు ఉప్పొంగిపోయారు. ఈ సీన్ కు ఎంజిఆర్ గెట‌ప్ లో ఉన్న ఓ న‌టుడితో క్లాప్ కొట్టించ‌డం ఇక్క‌డ విశేషం. ఎందుకంటే 1976లో ఈ చిత్ర ముహూర్తానికి ఎంజిఆర్ వ‌చ్చారు. అప్ప‌ట్లో ఆయ‌నే క్లాప్ కొట్టాడు. ఇక ఇప్పుడు ఈ బ‌యోపిక్ లో సీన్ కు కూడా ఎంజిఆర్ గెట‌ప్ తోనే ఓపెనింగ్ చేసారు. తేజ తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రం ఆగ‌స్ట్ నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు కానుంది. సంక్రాంతికి సినిమా విడుద‌ల కానుంది. మ‌రి చూడాలిక‌.. అన్న‌గారిగా బాల‌య్య ఎంత‌వ‌ర‌కు మెప్పిస్తాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here