నాని వ‌దినే.. నాగ‌చైత‌న్య‌కు కూడా..

Bhoomika

అవును.. నాని వ‌దిన ఇప్పుడు నాగ‌చైత‌న్య‌కు కూడా వ‌దిన‌గా మారుతుంద‌ని తెలుస్తుంది. ఒక‌ప్పుడు ప‌వ‌న్ హీరోయిన్ గా తెలుగులో భూమిక‌కు చాలా క్రేజ్ ఉండేది. ఖుషీ సినిమాతో ఈమె సృష్టించిన సంచ‌ల‌నం అలాంటిది మ‌రి. ఆ త‌ర్వాత ఎన్నో సినిమాల్లో న‌టించింది భూమిక‌. యోగా గురువు భ‌ర‌త్ ఠాకూర్ ను పెళ్ళి చేసుకున్న త‌ర్వాత సినిమాల‌కు దూర‌మైంది భూమిక‌. ఆర్థికంగా కూడా భూమిక ప‌రిస్థితి పెద్ద‌గా చెప్పుకోడానికి ఏమీ లేద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. దాంతో ఈ మ‌ధ్యే మ‌ళ్లీ సినిమాల వైపు వ‌చ్చింది ఈ భామ‌. ఈ మ‌ధ్యే ధోనీ సినిమాలో ఎమ్మెస్ ధోనీకి అక్క పాత్ర‌లో న‌టించిన భూమిక‌.. ఇప్పుడు ఎంసిఏలో నానికి వ‌దిన‌గా న‌టించింది. ఈ సినిమాలో భూమిక పాత్ర ప్రాణం. ఇక భూమిక కూడా ఈ పాత్ర‌కు తాను త‌ప్ప మరొక‌రు సూట్ కార‌నే రేంజ్ లో రెచ్చిపోయింది. దాంతో ఇప్పుడు ఈమెకు తెలుగులో ఆఫ‌ర్లు పెరిగిపోతున్నాయి. తాజాగా నాగ‌చైత‌న్య హీరోగా న‌టిస్తున్న స‌వ్య‌సాచిలోనూ భూమిక ప్ర‌ధాన భూమిక పోషిస్తుంద‌ని తెలుస్తుంది. ఇందులోనూ చైతూకు వ‌దిన పాత్ర‌లోనే భూమిక న‌టిస్తుంద‌ని వార్త‌లు వినిపిస్తు న్నాయి. ఇందులో మాధ‌వ‌న్ కు జోడీగా భూమిక న‌టించ‌నుంద‌ని తెలుస్తుంది. మొత్తానికి చూడాలిక‌.. భూమిక సెకండ్ ఇన్నింగ్స్ తెలుగులో ఎలా ఉండ‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here