నేషనల్ అవార్డుల్లో మరోసారి తెలుగు సినిమాలు సత్తా చూపించలేకపోయాయి. ఒక్క బాహుబలి మినహాయిస్తే మరే సినిమాకు కూడా అవార్డులు రాలేదు. ఎందుకో తెలియదు కానీ మరోసారి తెలుగు సినిమాకు అన్యాయమే జరిగింది. మనతో పోలిస్తే పక్కనున్న కన్నడ..
పైనున్న మళయాలంలో అవార్డుల పంట పండింది. ఇక బెంగాలీకి అయితే ఈ సారి మరీ ఎక్కువగా అవార్డులు ఇచ్చేసారు. తెలుగు నుంచి బాహుబలి 2 మూడు అవార్డులను అందుకుంది. బెస్ట్ హోల్ సమ్ ఎంటర్ టైన్మెంట్ తో పాటు విజువల్ ఎఫెక్ట్స్.. యాక్షన్ కొరియోగ్రఫీలో బాహుబలి 2కు అవార్డులు వచ్చాయి.
ఇక ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఘాజీ ఎంపికైంది. ఇక ఉత్తమ నటుడిగా బెంగాలీ యాక్టర్ రిద్ది సేన్ (నగర్ కిర్తాన్).. ఉత్తమ నటిగా శ్రీదేవి (మామ్).. ఉత్తమ గాయకుడిగా కేజే ఏసుదాస్.. ఉత్తమ గాయనిగా సాషా.. సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్(చెలియా).. కొరియోగ్రాఫర్ గా గణేష్ ఆచార్య (టాయ్ లెట్.. ఏక్ ప్రేమ్ కథ).. బెస్ట్ రీ రికార్డింగ్ మామ్ సినిమాకు దక్కింది. మొత్తానికి నేషనల్ అవార్డుల్లో సౌత్ సినిమా సత్తా చూపించింది కానీ తెలుగు సినిమాలకు మాత్రం ఊహిచినంత గుర్తింపు అయితే రాలేదు. గతేడాది పెళ్లిచూపులు రెండు.. జనతా గ్యారేజ్ రెండు అవార్డులు తీసుకొచ్చింది. కానీ ఈ సారి మాత్రం తెలుగులో అంత మెరవలేదు అవార్డులు.