ఇప్పటికే పవన్ పక్కకెళ్లిపోయాడు. ఈయన మళ్లీ లేచే అవకాశం.. లేస్తాడనే నమ్మకం.. లేస్తున్నాడనే ఆశ కూడా ఎవరిలోనూ కనిపించట్లేదు. వెంకీ సీన్స్ యాడ్ చేసినా కూడా ఇప్పుడు అజ్ఞాతవాసి పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. ఈ చిత్రం అతిపెద్ద డిజాస్టర్ గా మారే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. తొలిరోజు 40 కోట్లు వసూలు చేసిన సినిమా.. రెండో రోజుకు వచ్చేసరికి 5 కోట్లు మాత్రమే వసూలు చేసింది. పైగా తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు 27 కోట్ల షేర్ తీసుకొస్తే.. రెండో రోజుకు అది 4 కోట్లకు పడిపోయింది. ఈ లెక్కన అజ్ఞాతవాసి ఎంతగా డ్రాప్ అయిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఈ టైమ్ లో జై సింహాకు యావరేజ్ అనే టాక్ వచ్చింది.. గ్యాంగ్ కూడా పర్లేదంటున్నారు. ఈ రెండు సినిమాల మధ్య కచ్చితంగా పవన్ సినిమా నలిగిపోవడం ఖాయం. ఇదిలా ఉంటే సైలెంట్ గా రంగులరాట్నం వస్తుంది. ఇవన్నీ చూస్తుంటే ఈ సంక్రాంతి ఊహించినంత రేంజ్ లో మాత్రం లేదు. గత మూడేళ్లుగా సంక్రాంతి సినిమాలన్నీ సత్తా చూపించాయి. కానీ ఈ సారి మాత్రం చరిత్రలో నిలిచిపోయే చెత్త సంక్రాంతిగా మారింది. చూడాలిక.. ఈ సంక్రాంతిని ఎవరు క్యాష్ చేసుకుంటారో.??