సంక్రాంతి సినిమాల్లో అసలు విజేత ఏది.. కథానాయకుడు ఎంత ముంచేస్తోంది..

సంక్రాంతి సినిమాల్లో అన్నింటికంటే భారీ అంచనాలతో వచ్చిన సినిమా ఎన్టీఆర్ కథానాయకుడు. నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా వచ్చిన సినిమా కావడంతో అభిమానులు కూడా ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా ఈ చిత్రం డిజాస్టర్ అయిపోయింది. అన్నగారు జీవితాన్ని కూడా ఆంధ్రులు ఆదరించలేదు. ఇప్పుడు నిర్మాత బాలకృష్ణతో పాటు దర్శకుడు క్రిష్ కు కూడా అర్ధం కాని విషయం.

ఎందుకు ఎన్టీఆర్ కథానాయకుడు ప్రేక్షకులకు నచ్చలేదు అంటూ వాళ్ళు తలలు పట్టుకున్నారు. ఈ సినిమా నికరంగా డిస్ట్రిబ్యూటర్లకు 50 కోట్ల నష్టాలు తీసుకొచ్చేలా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ సంక్రాంతికి నిజంగానే పండగ చేసుకుంటున్న సినిమా అనిల్ రావిపూడి తెరకెక్కించిన f2. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా వచ్చిన ఈ ఈ చిత్రం ఇప్పటికే 40 కోట్ల షేర్ సాధించింది. ఈ సంక్రాంతికి పోటీ లేకుండా విన్నర్ గా నిలిచింది ఈ చిత్రం. ముందు నుంచి భారీ అంచనాలతో వచ్చిన అంచనాలకు తగ్గట్టుగానే రాణించింది.

ఇప్పటికే ఈ సినిమా అనుకున్న ప్రతి డిస్ట్రిబ్యూటర్ లాభాల్లోకి వచ్చేశాడు. ఓవర్సీస్ లో అయితే 1.5 మిలియన్ దిశగా అడుగులు వేస్తోంది. ఈ సంక్రాంతికి వచ్చిన మరో సినిమా వినయ విధేయ రామ. తొలి రోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం వారం రోజుల్లో 53 కోట్ల షేర్ వసూలు చేసింది. అయితే 95 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమాకు 53 కోట్లు ఒక లెక్క కాదు. రజినీకాంత్ పేట సినిమా కూడా తెలుగులో డిజాస్టర్ అయిపోయింది. ఓవరాల్గా ఈ పండగను పూర్తిగా క్యాష్ చేసుకున్న సినిమా ఒక్క f2 మాత్రమే.

sankranthi movies 2019

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here