కొత్త వాళ్లైనా.. పాత వాళ్లైనా.. హీరోలైనా దర్శకులైనా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ కు పడిపోని వాళ్లు మాత్రం ఉండరు. ఇప్పుడు తరుణ్ భాస్కర్ కూడా ఇదే చేస్తున్నాడు. ఈయన రెండో సినిమా ఈ నగరానికి ఏమైంది కూడా తొలి సినిమా విడుదలైన తేదీనే విడుదల కానుంది. అంటే పెళ్లిచూపులు వచ్చిన రోజే ఈ నగరానికి ఏమైంది కూడా వస్తుందన్నమాట. 2016 జూన్ 29న విడుదలైన పెళ్లిచూపులు సంచలనం సృష్టించింది.
ఇప్పుడు రెండో సినిమా కూడా ఇదే రోజు విడుదల చేయబోతున్నట్లు అనౌన్స్ చేసారు నిర్మాత సురేష్ బాబు. ఈ మధ్యే విడుదలైన ట్రైలర్ కు రెస్పాన్స్ అదిరింది. అంతా కొత్త వాళ్ళతో ఈయన చేస్తోన్న ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. దానికి కారణం తరుణ్ భాస్కర్. ట్రైలర్ రెండు నిమిషాలు ఉన్నా కూడా ఏమీ అర్థం కాలేదు. అసలేం కథ చెప్పాలనుకుంటున్నాడో ఇంత కూడా అంతు చిక్కలేదు.
అంటే దర్శకుడు అంత పకడ్బందీగా తన ట్రైలర్ కట్ చేయించుకున్నాడు. అప్పట్లో కబాలి సినిమాకు పోటీగా పెళ్లిచూపులు తీసుకొచ్చాడు.. ఇప్పుడు సంజూకు పోటీగా ఈ నగరానికి ఏమైంది అంటున్నాడు. ఇది కూడా పూర్తిగా కామెడీ ఎంటర్ టైనర్ అని తెలుస్తుంది. కాకపోతే కాస్త థ్రిల్లింగ్ అంశాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా దొంగతనం బ్యాక్ డ్రాప్ లో సినిమా వస్తుంది. హాలీవుడ్ క్రైమ్ కామెడీ తరహాలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు తరుణ్ భాస్కర్. మరి చూడాలిక.. ఈ నగరానికి ఏమైంది అంటూ ఏం చేస్తాడో..?