రంగ‌స్థ‌లంకు రాంరాం.. ఇక బోయపాటికి జై.. 

Regular Shooting of Ram Charan-Boyapati Srinu's Next Begins
ఏడాదిన్న‌ర‌గా ఒకే సినిమాతో అతుక్కుపోయాడు రామ్ చ‌ర‌ణ్. రంగ‌స్థ‌లం సినిమా కోసం త‌నను తాను మార్చుకుని సుకుమార్ కోసం అంకితం అయిపోయాడు మెగా వార‌సుడు. ఇప్పుడు ఈయ‌న మెల్ల‌గా మ‌రో సినిమాపై దృష్టి పెడుతున్నాడు. అదే బోయ‌పాటి శీను సినిమా. ఇప్ప‌టికే ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లైంది. చ‌ర‌ణ్ లేకుండానే తొలి షెడ్యూల్ పూర్తి చేసాడు ద‌ర్శ‌కుడు. ఇప్పుడు రెండో షెడ్యూల్ కు రంగం సిద్ధ‌మైంది. ఈ చిత్ర త‌ర్వాతి షెడ్యూల్ మార్చ్ 6 నుంచి హైద‌రాబాద్ లో మొద‌లు కానుంది. ఇందులో రామ్ చ‌ర‌ణ్ కూడా అడుగు పెడుతున్నాడు. హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా బోయ‌పాటి ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ ఇందులో హీరోయిన్ గా న‌టిస్తుంది. ఈ చిత్రాన్ని కేవ‌లం ఆర్నెళ్ల‌లో పూర్తిచేసి.. ద‌స‌రా విడుద‌ల‌కు ప్లాన్ చేస్తున్నాడు బోయ‌పాటి.
బోయ‌పాటి సినిమాపై మ‌రో వార్త కూడా వ‌స్తుంది. ఈ చిత్రం అప్ప‌ట్లో చిరంజీవి న‌టించిన గ్యాంగ్ లీడ‌ర్ సినిమాను పోలి ఉంటుంద‌ని తెలుస్తుంది. ఇప్ప‌టికే తండ్రి పాట‌ల‌కు చిందేసిన చ‌ర‌ణ్.. ఇప్పుడు సినిమాపై క‌న్నేసాడు. బోయ‌పాటి సినిమా చిరంజీవి గ్యాంగ్ లీడ‌ర్ ను పోలి ఉంటుంద‌ని.. ఈ క‌థ‌ను ఇప్ప‌టి ట్రెండ్ కు త‌గ్గ‌ట్లుగా బోయ‌పాటి త‌న స్టైల్ లో నాటి గ్యాంగ్ లీడ‌ర్ ను మార్చేస్తున్నాడ‌ని తెలుస్తుంది. దానికి రాజ‌స్థాన్ బ్యాక్ డ్రాప్ ఇస్తున్నాడ‌నే వార్త‌లు కూడా వినిపిస్తున్నాయి. ఇందులో నిజం కూడా లేక‌పోలేదు. బోయ‌పాటి సినిమాలో త‌మిళ హీరో ప్ర‌శాంత్ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఇది చ‌ర‌ణ్ కు పెద్ద‌న్న‌య్య పాత్ర. ఇక ఇప్పుడు అందాల రాక్ష‌సి ఫేమ్ న‌వీన్ చంద్ర మ‌రో అన్న‌య్య‌గా ఎంపిక‌య్యాడు. ఇత‌డికి జోడీగా అన‌న్య న‌టిస్తుంది. గ్యాంగ్ లీడ‌ర్ లోనూ చిరంజీవికి ఇద్ద‌రు అన్న‌య్య‌లు ఉంటారు.
ఒక‌టి ముర‌ళి మోహ‌న్.. మ‌రొక‌రు శ‌ర‌త్ కుమార్. ఇప్పుడు బోయ‌పాటి సినిమాలోనూ ఇద్ద‌రు అన్న‌య్య‌లు ఉన్నారు. ఇక విల‌న్ గా అందులో రావుగోపాల‌రావు ర‌ప్ఫాడిస్తే.. ఇక్క‌డ వివేక్ ఒబేరాయ్ న‌టిస్తున్నాడు. ఇది లెజెండ్ లో జ‌గ‌ప‌తిబాబు కారెక్ట‌ర్ కంటే ఐదు రెట్లు ఎక్కువ‌గా ఉంటుంది అంటున్నాడు బోయ‌పాటి శీను. ఈ చిత్రంలో మ‌రో స‌ర్ ప్రైజింగ్ ఎలిమెంట్ ఎమోష‌న్. హై ఓల్టేజ్ ఎమోష‌న‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ చిత్రం రూపొందుతుంద‌ని చెబుతున్నాడు బోయ‌పాటి. మ‌రి ఇది గ్యాంగ్ లీడ‌ర్ లా ఉంటుందా.. లేదంటే అక్క‌డ్నుంచి స్పూర్తి పొందుతున్నాడా అనేది ప‌క్క‌న‌బెడితే రామ్ చ‌ర‌ణ్ కు గ్యాంగ్ లీడ‌ర్ గా చూడ‌టం మాత్రం మెగా అభిమానుల‌కు పండ‌గే పండ‌గ‌. ఈ చిత్రం 2018 ద‌స‌రాకు విడుద‌ల కానుంది. గ‌తంలో బ్రూస్లీ.. గోవిందుడు అంద‌రివాడేలే ద‌స‌రాకే వ‌చ్చాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here