రాజుగాడు ఏం చేస్తాడో..?

Raju Gadu
ఇండ‌స్ట్రీలో ఈ రోజు రేపు వార‌సుల‌కే దిక్కులేదు. ఒక్క ప్లాప్ ప‌డితే వాళ్లే హిట్ కోసం తంటాలు ప‌డుతున్నారు. అఖిల్ ను చూడండి.. ఒక్క హిట్ అంటూ ఎలా తాప‌త్ర‌య‌ప‌డుతున్నాడో..? అలాంటిది ఏ స‌పోర్ట్ లేకుండా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి వ‌ర‌స‌గా మూడు విజ‌యాలు అందుకోవ‌డం అంటే చిన్న విష‌యం కాదు.. కానీ అది చేసాడు రాజ్ త‌రుణ్.
కానీ ఆ త‌ర్వాత జోరు త‌గ్గించాడు. ప్ర‌స్తుతం ఒక్క హిట్ అంటూ వేచి చూస్తున్నాడు. ఈయ‌న గ‌త సినిమా అంధ‌గాడుతో పాటు రంగుల‌రాట్నం కూడా అంచ‌నాలు అందుకోలేదు. ప్ర‌స్తుతం సంజ‌నా రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రాజుగాడు సినిమాలో న‌టిస్తున్నాడు రాజ్ త‌రుణ్. ఈ చిత్రం జూన్ 1న విడుద‌ల కానుంది. అమైరాద‌స్తూర్ ఇందులో హీరోయిన్. ప్ర‌స్తుతం ఈ కుర్ర హీరో ఆశ‌ల‌న్నీ ఈ చిత్రం పైనే ఉన్నాయి. ఇదిలా ఉండ‌గానే మ‌రో సినిమాకు క‌మిట‌య్యాడు ఈ హీరో.
దిల్ రాజు బ్యాన‌ర్ లో అలా ఎలా ఫేమ్ అనీల్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం చేస్తున్నాడు రాజ్ త‌రుణ్. ల‌వ‌ర్ అనే టైటిల్ తో ఈ చిత్రం వ‌స్తుంది. శ‌త‌మానం భ‌వ‌తి సినిమానే రాజ్ త‌రుణ్ తో చేయాల్సింది కానీ అనుకోని కార‌ణాల‌తో ఈ సినిమా శ‌ర్వానంద్ కు వెళ్లిపోయింది. అలా మిస్సైన ఛాన్స్ ఇప్పుడు అనీల్ కృష్ణ సినిమా రూపంలో ద‌క్కించుకున్నాడు రాజ్ త‌రుణ్. మొత్తానికి బ్యాడ్ టైమ్ లో బంప‌ర్ ఆఫ‌ర్ లా దిల్ రాజు సినిమా ప‌ట్టేసాడు ఈ కుర్ర హీరో. మ‌రి ఈ ల‌వ‌ర్ రాజ్ త‌రుణ్ కెరీర్ కు ఎంత వ‌ర‌కు బ్రేక్ ఇస్తుందో చూడాలి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here