ల‌వ‌ర్ టీజ‌ర్.. కొత్త‌గా ఏం లేదుగా..!

Lover Teaser

అస‌లే ఆశ‌ల‌న్నీ ఆ సినిమాపైనే ఉన్నాయి. అలాంటి సినిమా టీజ‌ర్ లోనే ఏం లేదిప్పుడు. అస‌లే సినిమా గురించి ఈ టాపిక్ అనుకుంటున్నారా… రాజ్ త‌రుణ్ ల‌వ‌ర్ సినిమా గురించే ఈ డిస్క‌ష‌న్ అంతా. అనీష్ కృష్ణ తెర‌కెక్కిస్తోన్న ఈ సినిమా షూటింగ్ పూర్త‌యింది. తాజాగా టీజ‌ర్ కూడా విడు ద‌ల అయింది. సినిమాలో ఎంత విష‌యం ఉందో తెలియ‌దు కానీ టీజ‌ర్ లో మాత్రం ఏం అంత స్ట‌ఫ్ అయితే క‌నిపించ‌లేదు.

పైగా రాజ్ త‌రుణ్ లుక్ మాత్ర‌మే కొత్త‌గా ఉంది కానీ మిగిలిందంతా సేమ్ టూ సేమ్. ఇప్ప‌టికే దిల్ రాజే త‌న సినిమాల్లో చాలా ఇలాంటి సీన్స్ చూపించి ఉంటాడు. మ‌ళ్లీమ‌ళ్లీ అదే ల‌వ‌ర్ లో క‌నిపించింది. ముప్పై సెక‌న్ల టీజ‌ర్ ను చూసి సినిమా ఇలా ఉంటుంది అని డిసైడ్ చేయ‌డం త‌ప్పే కానీ టీజ‌ర్ మాత్రం ఆక‌ట్టుకునేలా లేదు అనేది మాత్రం ఒప్పుకోవాల్సిన వాస్త‌వం.మ‌రోవైపు రాజ్ త‌రుణ్ మార్కెట్ ఇప్పుడు క‌నీసం కోటి రూపాయ‌లు కూడా వ‌సూలు చేయ‌లేని స్థాయికి దిగ‌జారిపోయింది. ఇలాంటి టైమ్ లో ల‌వ‌ర్ తో వ‌స్తున్నాడు త‌రుణ్.

దిల్ రాజు నిర్మాత కావ‌డంతో ఈ చిత్రంతో క‌చ్చితంగా త‌ను ఫామ్ లోకి వ‌స్తాన‌ని న‌మ్ముతున్నాడు రాజ్ త‌రుణ్. తొలి సినిమా అలా ఎలాను కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కించిన ఈయ‌న ఇప్పుడు మాత్రం ప్యూర్ ల‌వ్ స్టోరీగా వ‌స్తున్న ల‌వ‌ర్.. రాజ్ త‌రుణ్ ఆశ‌ల్ని ఎంత‌వ‌ర‌కు నిల‌బెడుతుందో తెలియ‌దు. ఈ చిత్రంలో రిద్ది కుమార్ హీరోయిన్ గా న‌టిస్తుంది. జులైలో ల‌వ‌ర్ విడుద‌ల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here