ఎన్టీఆర్ సినిమాలో విద్యాబాలన్ హీరోయిన్ అని తెలియగానే అంతా ఒక్కటే అనుకున్నారు.. బాలయ్య భారీగా ముట్టచెప్పి మరీ విద్యాను తెలుగు ఇండస్ట్రీకి తీసుకొచ్చాడని. ఎందుకంటే దీనికంటే ముందే రెండు మూడు సినిమాలకు నో చెప్పింది విద్యాబాలన్.
చిరంజీవి సైరా కోసం ముందు విద్యా బాలన్ ను అనుకున్నాడు. కానీ ఆమె ఒప్పుకోలేదు. దానికంటే ముందు బాలయ్య కూడా అప్పట్లో శాతకర్ణి కోసం ఈమెనే ముందు హీరోయిన్ గా తీసుకోవాలని ప్రయత్నించాడు. కానీ అప్పుడు కుదర్లేదు.. ఇప్పుడు కుదిరింది. ఎన్టీఆర్ బయోపిక్ లో నటించడానికి విద్యాబాలన్ కు మూడు కోట్లు ఇచ్చారనే ప్రచారం కూడా జరిగింది. అయితే అసలు నిజం ఇప్పుడే బయటికి వచ్చింది.
కోటిన్నర వరకు ఈ సినిమా కోసం విద్యాబాలన్ కు ముట్టింది అని తెలుస్తుంది. ఇదే నిజమైతే గనక చాలా తక్కువ రెమ్యునరేషన్ కు విద్య ఒప్పుకున్నట్లు లెక్క. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడి హీరోయిన్ లను తీసుకున్నా కూడా కచ్చితంగా కోటి నుంచి రెండు కోట్ల వరకు ఇవ్వాల్సి వచ్చేంది. విద్యాబాలన్ ను కోటిన్నరలో తీసుకుంటే.. బాలీవుడ్ లోనూ ఈ చిత్రానికి మంచి గిరాకీ ఉండటం ఖాయం. క్రిష్ ప్లస్ విద్యాబాలన్ క్రేజ్ తో ఎన్టీఆర్ బయోపిక్ కు అక్కడ కూడా మంచి క్రేజ్ రావడం ఖాయం. జనవరి 9, 2019న విడుదల కానుంది ఈ చిత్రం.