సునీల్ రీ ఎంట్రీ అదిరిపోతుందిగా.. 

Sunil Sudigadu 2
తెలిసి చేసినా తెలియ‌క చేసినా త‌ప్పు త‌ప్పే. త‌ప్పు చేయ‌డం ఒక్కోసారి త‌ప్పు కాక‌పోవ‌చ్చు. కానీ చేసిన త‌ప్పు తెలుసుకోక‌పోవ‌డం మాత్రం త‌ప్పే. అదే త‌ప్పు మ‌ళ్లీ చేస్తే ఇక నేర్చుకున్న‌ది ఏముంటుంది..? ఇప్పుడు సునీల్ ఇలాంటి త‌ప్పు చేయ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతున్నాడు. ఈయ‌న హీరోగా మారినప్ప‌ట్నుంచీ జాత‌కం తిర‌గ‌బడుతూనే ఉంది. అప్పుడెప్పుడో 2013లో పూల‌రంగ‌డితో వ‌చ్చిన విజ‌యం.. మ‌ళ్లీ ఇప్ప‌టి వ‌ర‌కు రాలేదు. ఈ ఐదేళ్ల‌లో ఎన్ని సినిమాలు చేసినా ప్రేక్ష‌కులు మాత్రం సునీల్ ను చూడ‌లేక‌పోయారు. దాంతో మ‌ళ్లీ క‌మెడియ‌న్ గా రీ ఎంట్రీ ఇస్తున్నాడు సునీల్. ఈ విష‌యంలో చాలా సీరియ‌స్ గా ఉన్న సునీల్.. రీ ఎంట్రీని మాత్రం ఘ‌నంగా ప్లాన్ చేసుకుంటున్నాడు.
అదేం విచిత్ర‌మో కానీ ఇండ‌స్ట్రీలో ఎప్పుడు ఎవ‌రిపై రాన‌న్ని గాసిప్స్ అన్నీ సునీల్ పైనే వ‌స్తుంటాయి. ఈయ‌న చూడ్డానికి చాలా కామ్ గా ఉంటాడు కానీ గాలి వార్త‌లు మాత్రం భీమ‌వ‌రం బుల్లోడిపైనే వ‌స్తుంటాయి. దానికి కార‌ణం ఏంటో త‌న‌కు కూడా తెలియ‌దంటున్నాడు ఈ హీరో. అయితే ఈ గాసిప్స్ మాత్రం తాను కూడా ఎంజాయ్ చేస్తానంటున్నాడు సునీల్. ఆ మ‌ధ్య అజ్ఞాత‌వాసిలో సునీల్ కోసం త్రివిక్ర‌మ్ ఓ రోల్ రాసాడు. కానీ బిజీ కార‌ణంగా అది వ‌దిలేసాడు. అయితే అజ్ఞాత‌వాసి మిస్సైనా.. ఎన్టీఆర్-త్రివిక్ర‌మ్ సినిమాలో మాత్రం తాను న‌టిస్తు న్న‌ట్లు తేల్చేసాడు సునీల్. ఇక‌పై క‌మెడియ‌న్ గానూ స‌త్తా చూపిస్తాన‌ని చెబుతున్నాడు ఈ భీమ‌వ‌రం బుల్లోడు. ఈ సినిమాతో పాటు శీనువైట్ల‌-ర‌వితేజ‌.. తేజ‌-వెంక‌టేశ్.. అల్ల‌రిన‌రేష్ సుడిగాడు 2.. సైరా లాంటి సినిమాల్లో న‌టిస్తున్నాడు సునీల్. మ‌రి వీటితో మ‌నోడి కెరీర్ మ‌ళ్లీ గాడిన ప‌డిన‌ట్లేనా..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here