సెగ‌లు రేపుతున్న శ్రీ‌లంక‌న్ పోరీ..


పుట్టింది పెరిగింది శ్రీ‌లంక‌లో.. కానీ స్టార్ డ‌మ్ అనుభ‌విస్తుంది మాత్రం ఇండియాలో. బాలీవుడ్ లో కొన్నేళ్లుగా త‌న‌దైన క్రేజ్ తో ముందుకెళ్తుంది జాక్వ‌లిన్ ఫెర్నాండేజ్. అందాలకు తోడు వాటిని ఆర‌బోసే గుణం కూడా ఉండ‌టంతో ఈ భామ‌ను బాగానే ద‌త్త‌త తీసుకున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.
ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ఆరేళ్లైపోయినా ఇప్ప‌టికీ ఆఫ‌ర్ల‌తో దూసుకుపోతుంది. స‌ల్మాన్ ఖాన్ లాంటి హీరోల అండ ఉండ‌టం ఈమెకు క‌లిసొచ్చే విష‌యం. ఇప్పుడు కూడా వ‌ర‌స సినిమాల‌తో ర‌చ్చ చేస్తున్న జాక్వ‌లిన్.. మ‌ధ్య‌మ‌ధ్య‌లో హాట్ ఫోటోషూట్ల‌తో ఫ్యూజులు ఎగ‌ర‌గొడుతుంటుంది. ఇప్పుడు కూడా ఇదే చేసింది.
సీజ‌న్ మారిన మొద‌ట్లోనే హాట్ ఫోటోస్ తో ట్రీట్ ఇచ్చింది ఈ శ్రీ‌లంక‌న్ బ్యూటీ. ఈ మ‌ధ్యే స‌ల్మాన్ తో న‌టించిన రేస్ 3 ఫ్లాప్ అయింది. దాంతో మ‌ళ్లీ ఇప్పుడు త‌న‌ను తాను నిరూపించుకునే ప‌నిలో ప‌డింది ఈ భామ‌. ఈ హాట్ ఫోజులు చూసి కుర్రాళ్ల‌కు నిద్ర కూడా ప‌ట్ట‌ట్లేదు ఇప్పుడు. మొత్తానికి అటు సినిమాలు.. ఇటు ఫోటోషూట్స్ తో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డిపేస్తుంది జాక్వ‌లిన్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here