12వ నెల‌.. డిసెంబ‌ర్ 15.. 12 సినిమాలు.. 

naveen chandra nivetha thomas upcoming movie juliet lover of idiot comming on dec 15th
శుక్ర‌వారం వ‌చ్చిందంటే చాలు.. చిన్న నిర్మాత‌లు ఏ రేంజ్ లో పండ‌గ చేసుకుంటారో అర్థ‌మైపోతుంది. పెద్దోళ్లు గ్యాప్ ఇస్తే చిన్నోళ్ళ దండ‌యాత్ర ఎలా ఉంటుందో కొన్ని వారాలుగా చూస్తున్నాం. మొన్న న‌వంబ‌ర్ 17న 10 సినిమాలు.. 24న 10 సినిమాలు విడుద‌ల‌య్యాయి. అది మ‌ర‌వ‌క‌ముందే గ‌తవారం కూడా అర‌డ‌జ‌న్ సినిమాలు వ‌చ్చాయి. ఇక ఇప్పుడు రాబోయే వారం కూడా ఫుల్లుగా సినిమాల‌తో నిండిపోనుంది బాక్సాఫీస్. గ‌త‌ వారం వ‌చ్చిన స‌ప్త‌గిరి ఎల్ఎల్ బి.. మ‌ళ్లీరావా ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోవ‌డంలో విఫ‌లం అయ్యాయి. సుమంత్ మ‌ళ్లీరావాకు మంచి టాక్ వ‌చ్చినా వ‌సూళ్ల ద‌గ్గ‌ర మాత్రం ఈ చిత్రం నిల‌బ‌డ‌లేక‌పోయింది. ఇక ఈ వారం అంటే డిసెంబ‌ర్ 15న 12 సినిమాలు విడుద‌ల కానున్నాయి. ఇందులో యాంక‌ర్ ర‌వి హీరోగా అయోధ్య కార్తిక్ తెర‌కెక్కించిన చిత్రం ఇది మా ప్రేమ‌క‌థ కూడా ఉంది. సీరియ‌ల్ హీరోయిన్ మేఘ‌నా లోకేష్ ఇందులో న‌టించింది. ఈ చిత్రం డిసెంబ‌ర్ 15న విడుదల కానుంది.
దాంతో పాటు నందు, శ్రీ‌ముఖి జంట‌గా న‌టించిన కుటుంబ క‌థా చిత్రం..  న‌వీన్ చంద్ర, నివేదా థామ‌స్ జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్.. సీత రాముని కోసం.. ర‌మ్య‌కృష్ణ మ‌ళ‌యాల డ‌బ్బింగ్ మాతంగి.. విక్ర‌మ్ డ‌బ్బింగ్ చిత్రం 10.. ప్రేమ పందెం.. మ‌రో దృశ్యం.. ఉందా లేదా.. కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్.. లచ్చి.. పడిపోయా నీ మాయలో.. తొలి పరిచయం.. మామ ఓ చందమామ.. ఇలా ఒకేరోజు 12 స్ట్రెయిట్ సినిమాలు.. 2 డ‌బ్బింగ్ సినిమాలు విడుద‌ల కానున్నాయి. డిసెంబ‌ర్ 21 నుంచి పెద్ద సినిమాల జాత‌ర మొద‌లు కానుంది. అందుకే దొరికిన ఈ ఒక్క వారాన్ని పూర్తిగా స‌ద్వినియోగం చేసుకుంటున్నారు నిర్మాత‌లు. మ‌రి వీటిలో ఏది విజ‌యం సాధిస్తుందో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here