2.0 పోస్ట్ పోన్.. ర‌జినీ ఫ్యాన్స్ హ్యాపీ..

అదేంటి సినిమా పోస్ట్ పోన్ అయితే బాధ ప‌డాలి కానీ ఆనంద‌ప‌డ‌టం ఏంటి అనుకుంటున్నారా..? అంతే దాని వెన‌క ఓ క‌థ ఉంది. ఇప్పుడు 2.0 కోసమే వేచి చూస్తూ కూర్చుంటే పుణ్య‌కాలం కాస్తా గ‌డిచిపోతుంది. అక్క‌డ మ‌రో సినిమా నాశ‌నం అయిపోతుంది. అదే కాలా. 2.0 ను న‌మ్ముకుని చాలా కాలంగా వేచి చూస్తుంది ఈ చిత్రం. ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ కూడా పూర్తైపోయింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ లో బిజీగా ఉంది కాలా. ఈ చిత్రంలోనూ మాఫియా డాన్ గానే న‌టిస్తున్నాడు సూప‌ర్ స్టార్. ఒక‌వేళ 2.0 ఎప్రిల్లో విడుద‌లైతే దీన్ని జూన్ లో తీసుకొద్దాం అనుకున్నాడు నిర్మాత ధ‌నుష్. కానీ 2.0 విడుద‌ల తేదీపై ఇంకా క్లారిటీ రావ‌డం లేదు. దాంతో ధ‌నుష్ నిర్ణ‌యం తీసుకున్నాడు. కాలా చిత్రం ఎప్రిల్ 27న రాబోతున్న‌ట్లు అఫీషియ‌ల్ గా ప్ర‌క‌టించాడు నిర్మాత ధ‌నుష్.
కాలా రాక‌తో ర‌జినీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఏదో ఓ సినిమా.. ముందు ర‌జినీకాంత్ ను అయితే తెర‌పై చూడొచ్చు క‌దా అనేది వాళ్ల ఆశ‌. పైగా క‌బాలి సినిమా తెలుగులో ఫ్లాప్ కానీ త‌మిళ‌నాట పెద్ద హిట్. ఈ సినిమాను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడే కావ‌డంతో కాలాపై అంచ‌నాలు చాలా ఉన్నాయి ఇందులో త‌మిళుల‌ను కాపాడే నాయ‌కుడిగా న‌టిస్తున్నాడు ర‌జినీకాంత్. ఈ పాత్ర పేరు కాలా క‌రికాల‌న్. కాలా రాక‌తో 2.0 సినిమా దివాళికి పోస్ట్ పోన్ అయింది. ఇక్క‌డే ఓ రికార్డ్ ర‌జినీ కోసం వేచి చూస్తుంది.
ర‌జినీ నుంచి ఇలా ఒకే ఏడాది రెండు సినిమాలొచ్చి 23 ఏళ్లైంది. చివ‌ర‌గా 1995లో ముత్తు, బాషా సినిమాల‌తో వ‌చ్చాడు సూప‌ర్ స్టార్. అదే ఏడాది హిందీలో ఆటంక్ హీ ఆటంక్.. తెలుగులో పెద‌రాయుడు సినిమాల్లోనూ న‌టించాడు ర‌జినీ. మ‌ళ్లీ ఇన్నేళ్ళ త‌ర్వాత ఒకే ఏడాది రెండు చిత్రాల‌తో వ‌స్తున్నాడు ర‌జినీకాంత్. 2014లో లింగా, కొచ్చాడ‌యాన్ వ‌చ్చాయి కానీ అందులో ఒక‌టి యానిమేష‌న్ సినిమా. దాంతో ఇప్పుడు కాలా, 2.0 వ‌స్తున్నాయి. అది కూడా అనుకోకుండా ప‌డిన వాయిదాల‌ వ‌ల్ల‌. కార‌ణం ఏదైనా కావ‌చ్చు.. ఒకే ఏడాది రజినీ రెండు సినిమాల‌తో రావ‌డం అనేది మాత్రం అభిమానుల‌కు ఆ క‌లే. ఇప్పుడు దాన్ని తీరుస్తున్నాడు సూప‌ర్ స్టార్. మ‌రి ఇవి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సృష్టించే సంచ‌ల‌నాలు ఎలా ఉంటాయో చూడాలి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here