యూపీఏ-2 హయాంలో 2G స్కాం దేశాన్ని ఊపేసిన సంగతి అందరికి తెలిసిందే అయితే కేసు విచారణ గత ఏప్రిల్ 26న ముగియగా కేసు తీర్పును డిసెంబర్ 21న వెలువరించనున్నట్టు ఢిల్లీ సీబీఐ కోర్టు డిసెంబర్ మొదటి వారంలో ప్రకటించింది. ఈరోజు కోర్ట్ లో ఎంకే సీనియర్నేత, కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజా, రాజ్యసభ సభ్యురాలు కనిమొళి సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న అందరినీ నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది.ప్రాసిక్యూషన్ తగిన సాక్ష్యాలు చూపించలేకపోయిదంటూ స్పెషల్ సీబీఐ జడ్జి ఓపీ సైని పేర్కొంటూ ఈ కేసును కొట్టివేశారు. దీనితో ఇటు యూపీఏ ప్రభుత్వం లో ప్రధాన మంత్రిగ ఉన్న మన్మోహన్ సింగ్ కి డీఎంకే ప్రభుత్వానికి బలం చేకూరినట్టు అయింది .