60 కోట్ల క్ల‌బ్ లో ఎంసిఏ.. 

MCA
పేరు చూస్తే మిడిల్ క్లాస్ అబ్బాయి. కానీ వ‌చ్చిన క‌లెక్ష‌న్లు చూస్తుంటే మాత్రం అప్ప‌ర్ క్లాస్ అబ్బాయే. నాని దూకుడు ముందు రికార్డులు కూడా బ‌ద్ద‌లైపోతున్నాయి. అస‌లు ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఎంసిఏ నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం నేనులోక‌ల్ రికార్డుల‌ను సైతం బ‌ద్ద‌లు కొట్టేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు 12 రోజుల్లోనే ప్ర‌పంచ వ్యాప్తంగా 36 కోట్ల షేర్.. 60 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసింది. నాని ఇప్పుడు 50 కోట్ల గ్రాస్ నీళ్లు తాగినంత ఈజీగా దాటేస్తున్నాడు. ఈయ‌న గ‌త సినిమాలు నేనులోక‌ల్.. నిన్నుకోరి కూడా 50 కోట్ల గ్రాస్ అందుకున్నాయి. ఇక ఇప్పుడు ఎంసిఏ అయితే కేవ‌లం 8 రోజుల్లోనే 50 కోట్ల మార్క్ అందుకుంది. ఇప్ప‌టికే 12 రోజుల్లో 35 కోట్ల షేర్ వ‌సూలు చేసింది ఎంసిఏ. రెండో వారం కూడా ఈ సినిమా హ‌వానే క‌నిపించింది. ఒక్క‌క్ష‌ణం.. 2 కంట్రీస్ తో పాటు హ‌లో కూడా ఉన్నా అంద‌రి అడుగు మిడిల్ క్లాస్ అబ్బాయి వైపే ప‌డ్డాయి. ఓవ‌ర్సీస్ లోనూ మిలియ‌న్ మార్క్ దాటేసింది ఈ చిత్రం. 2017లో వ‌ర‌స‌గా మూడోసారి కూడా మిలియ‌న్ డాల‌ర్ సినిమా ఇచ్చి.. సౌత్ ఇండియాలో స‌రికొత్త రికార్డు సృష్టించాడు నాని. ఇప్ప‌టికే ఎంసిఏ ఖాతాలో 60 కోట్ల గ్రాస్ ఉంది. జ‌న‌వ‌రి 10న అజ్ఞాత‌వాసి వ‌చ్చే వ‌ర‌కు మ‌రో సినిమా కూడా లేదు. దాంతో  మూడో వారం కూడా పూర్తిగా ఎంసిఏకే క‌లెక్ష‌న్లు వ‌చ్చే అవ‌కాశం క‌నిపిస్తుంది. మొత్తానికి 2017 ఒక్క ఏడాదే మూడు మిలియ‌న్ మార్క్ సినిమాలు.. మూడు 50 కోట్ల గ్రాస్ అందుకున్న హీరోగా చ‌రిత్ర సృష్టించాడు న్యాచుర‌ల్ స్టార్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here