తెలుగు రాష్ట్రాల్లో ఎలక్ట్రానిక్ మీడియా శర వేగంగా విస్తరిస్తున్న తరుణంలో జే-9 పేరుతో మరో రెండు న్యూస్, ఒక ఎంటర్టైన్మెంట్ ఛానళ్లు ప్రారంభానికి రంగం సిద్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు ప్రముఖ పారిశ్రామికవేత్తల సార్థ్యంలో దాదాపు వంద కోట్ల రూపాయల పెట్టుబడితో పెద్ద ఎత్తున ఛానళ్లు రాబోతున్నాయి.
ఛానళ్ల ప్రారంభానికి డిసెంబర్ 10 తేదీ ముహూర్తం కూడా కరారు చేశారు. ఎన్నికలకు ఏడాది ముందుగానే ప్రారంభిస్తే ఎన్నికల నాటికి పూర్తిగా ఎస్టాబ్లిష్ కావచ్చనేది పెట్టుబడిదారుల నిర్ణయంగా కనిపిస్తోంది. ఛానల్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఛానల్ ప్రారంభం నాటికే రెండు రాష్ట్రాల్లో వంద శాతం కనెక్టివిటీ కోసం కేబుల్ ఆపరేటర్లు, డీటీహెచ్ సంస్థలతో యాజమాన్యం చర్చలు జరుపుతోంది.
నిన్న మొన్నటి వరకు మహా న్యూస్ సీఈవోగా పని చేసిన యలమంచిలి నగేష్ జే-9 సీఈవోగా చేరారు. మహా న్యూస్ కష్టకాలంలో సీఈవోగా వ్యవహరించిన నగేష్ జే-9 గ్రూప్ ఛానళ్ల బాధ్యత నిర్వర్తిస్తారని తెలుస్తోంది. మార్కెటింగ్ రంగంలో అపారమైన అనుభవం కలిగిన నగేష్ మహాన్యూస్ ను నిలబెట్టడంలో తనదైన పాత్ర పోషించారు. సౌమ్యుడిగా, అందరిని కలుపుకొని వెళ్లే వ్యక్తత్వం ఉన్న నగేష్ సీఈవో కొత్త బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించగలరని యాజమాన్యం నమ్ముతోంది.
అమీర్ పేట ప్రాంతంలో ఆఫీస్ స్పేస్ తీసుకున్న జే-9 స్టూడియోలు, వర్క్ స్టేషన్ల ఏర్పాటు ప్రారంభించింది. మరో పది రోజుల్లో రిక్రుట్మెంట్ ప్రక్రియ కూడా ప్రారంభించనుంది. కీలకమైన ఎడిటోరియల్, గ్రాఫిక్స్, మార్కెటింగ్, టెక్నికల్ కు సంబంధించి ఇన్చార్జ్ లకు సంబంధించి ఇప్పటికే ఓ నిర్ణయానికి కూడా వచ్చినట్లు తెలుస్తోంది. ఉద్యోగార్థులు జే-9 కోసం రడీగా ఉండండి.