రెండు వైపులా పదునున్న కత్తి వంటిది టెక్నాలజీ. ఇంటర్నెట్ వల్ల ఎంత మేలు ఉందొ అంతే కీడు కూడా పొంచి ఉన్నదన్న సంగతి అందరికి తెలిసిందే. ఇంటర్నెట్ లో అస్లీల మార్ఫింగ్ ఫోటోలు పెట్టి అమ్మాయిల జీవితాలతో చలగాటమాడే ఆకతాయిలు రాను రాను పెరిగిపోతున్నారు. సెలెబ్రిటీల సంగతి అయితే చెప్పనక్కర్లేదు. సుచిలీక్స్ ఉదంతం ఈ ఏడాది ప్రారంభంలో తమిళ చిత్ర సీమ లో రేపిన ప్రకంపనలు ఇక్కడ గుర్తు చేసుకోవాలి. హీరోయిన్ ల అస్లీల చిత్రాలు, వీడియోలు ఇంటర్నెట్ లో ఓ గాయని బయటపెట్టినట్లు కొందరు దుండగులు చలామణి చేసారు.
అసలు విషయంలోకి వస్తే, గత వరం నోబెల్ పురస్కారం అందుకున్న పాకిస్తాన్ యువతి మలాలా జీన్స్ వేసుకున్న చిత్రాలు ఇంటర్నెట్ లో హల్చల్ చేసాయి. ఆ చిత్రాలకు గాను ఇస్లాం ఛాందసవాదుల నుండి తీవ్ర విమర్శలు ఎదురుకోవాల్సి వచ్చింది ఆమె. అయితే అవి నకిలీవని తర్వాత తెలిసింది.
తాజా గా మరో వివాదం తెరపైకి వచ్చింది. ఓ పోర్నోగ్రఫీ నటిని మేరీ మాతగా చిత్రీకరించిన ఫోటో ఒకటి పెద్ద దుమారమే లేపింది. మియా ఖలీఫా అనే పోర్న్ స్టార్ తన ఫోటో ను మేరీ మాత గా మార్ఫింగ్ చేసి సామజిక మాధ్యమం లో ప్రచురించింది. అందుకు గాను ఆమెను దూషిస్తూ చాలామంది కామెంట్స్ పెట్టారు. కొందరయితే చంపేస్తామని బెదిరించారు కూడా. మియా ఖలీఫా మాత్రం ఫోటో ను తొలగించక పోగా వాళ్ళను ఇంకా రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తుంది.