ఒకటి రెండు కాదు.. వరసగా ఏడు విజయాలు తీసుకొచ్చిన ఇమేజ్ అది. అంత త్వరగా ఎందుకు పోతుంది. నానిపై ప్రేక్షకులకు ఉన్న నమ్మకం కూడా అలాంటిదే. ఈయన సినిమా ఎలా ఉన్నా ఓ సారి చూడొచ్చు అనే నమ్మకాన్ని ప్రేక్షకుల్లో కలిగించాడు న్యాచురల్ స్టార్. ఇదే ఇప్పుడు ఈ హీరోను కాపాడుతుంది. ఎంసిఏకు టాక్ యావరేజ్ గా ఉన్నా కలెక్షన్లు కుమ్మేయడానికి కారణం ఇదే. తొలిరోజు వచ్చిన టాక్ కు.. హలో పాజిటివ్ టాక్ కు ఎంసిఏ నిలబడటమే కష్టం అనుకున్నారంతా. కానీ చాలా ఏరియాల్లో రెండో రోజు కూడా మిడిల్ క్లాస్ అబ్బాయి కుమ్మేసాడు. ఆల్ మోస్ట్ హలోకు సమానంగా కలెక్షన్లు సాధించాడు. తొలి రెండు రోజుల్లోనే 14 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. 30 కోట్ల షేర్ వస్తే హిట్ అనుకుంటే.. సగం వసూళ్లు అప్పుడే తీసుకొచ్చాడు నాని. ఇంకా మూడు రోజులు సెలవులున్నాయి. ఈ లెక్కన మరో 10 కోట్లైనా వస్తాయని లెక్కలేస్తున్నారు ట్రేడ్ పండితులు. హలో వచ్చినా.. ఎంసిఏ టాక్ బ్యాడ్ గా ఉన్నా రెండోరోజు నిలబడి 4 కోట్లకు పైగానే షేర్ సాధించింది. ఈ లెక్కన సినిమాకు మాస్ ప్రేక్షకుల ఓట్లు పడుతున్నాయన్నమాట. ఇప్పటికే ఓవర్సీస్ లో 5 లక్షల డాలర్ల వైపు పరుగులు తీస్తుంది ఎంసిఏ. తొలి నాలుగు రోజుల్లో కచ్చితంగా 20 కోట్లకు పైగా వసూలు చేసేలా కనిపిస్తుంది ఎంసిఏ. ఇదే జరిగితే ఆ తర్వాత వచ్చే వసూళ్లు కీలకం కానున్నాయి. మొత్తానికి ఎంసిఏ నానికి వరసగా ఎనిమిదో విజయం అవుతుందో లేదో చూడాలిక..!