ఒకప్పుడు ఆయన కనిపిస్తే విజిల్స్.. ఆయన బట్టతలకు స్టార్ హీరోలకు ఉన్నంత క్రేజ్.. కానీ ఇప్పుడు అవన్నీ ఏమీ లేవు. ఇండస్ట్రీలో టైమ్ టర్న్ అవ్వడానికి కొన్ని రోజులు చాలు.. ఇప్పుడు బ్రహ్మానందం విషయంలోనూ ఇదే జరుగుతుంది. ఒకప్పుడు ఈయన ఒక్క సీన్ లో ఉంటేనే నవ్వులు పూసేవి. ఇప్పుడు ఆయన సినిమా అంతా ఉన్నా కూడా నవ్వులు రావట్లేదు సరికదా చిరాకు వస్తుంది. జై సింహాలో పెద్ద రోల్ చేసాడు బ్రహ్మి. కానీ మునపటిలా నవ్వించలేకపోయాడు. ఆయన ఉన్న సీన్స్ అన్నీ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాయి. అయితే మిగిలిన సినిమా మాత్రం రొటీన్ గా ఉన్నా బాగుంది అనిపిచింది.
ఇక ఈ మధ్య కాలంలో బ్రహ్మానందంకు చెప్పుకోదగ్గ పాత్రలు కూడా రాలేదు. రేసుగుర్రం తర్వాత ఆ స్థాయిలో నవ్వించిన పాత్ర లేదు. లౌక్యంలో ఉన్నంతలో కాస్త బెటర్. అఖిల్, సౌఖ్యం, సర్దార్ లాంటి సినిమాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదేమో. ఇక ఖైదీ నెం.150లో కూడా బ్రహ్మి కామెడీ పెద్దగా పేలలేదు. ఇప్పుడు జై సింహా కూడా అంతే. సినిమా బాగున్నా.. ఆయన పాత్ర బాగోలేదు. ఇలాంటి టైమ్ లో ఆయన ఆశలన్నీ కళ్యాణ్ రామ్ ఎమ్మెల్యే.. విష్ణు ఆచారి అమెరికా యాత్ర సినిమాలపైనే ఉన్నాయి. మొత్తానికి ఇప్పుడు బ్రహ్మానందం జాతకం ఎవరు మారుస్తారో చూడాలిక..!